రాత్రివేళల్లో రైలుప్రయాణంలో డెస్టినేషన్ అలెర్ట్ ఫీచర్.. ఫోన్ కే అలెర్ట్ కాల్; ప్రశాంతంగా నిద్రపోండి!!
రైలు ప్రయాణికులు సౌకర్యవంతమైన, సుఖవంతమైన ప్రయాణం చేయడం కోసం రైల్వే అనేక చర్యలను ఇప్పటికే చేపట్టింది. అయితే చాలా వరకు రైల్వే ప్రయాణికులకు వీటిపై అవగాహన ఉండడం లేదు. రైలులో ప్రయాణం చేసేవారికి కేవలం రవాణా సౌకర్యాన్ని మాత్రమే అందించడానికి రైల్వేలు పరిమితం కాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో భారతీయ రైల్వేలు ఆన్లైన్ టికెట్లను బుక్ చేసుకుని, అవసరం లేదనుకుంటే రద్దు చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. అంతేకాదు 24గంటలు టోల్ ఫ్రీ కస్టమర్ సేవలను అందించడం తో పాటు, మరింత ఉపయోగకరమైన ఆన్లైన్ సేవలను కూడా భారతీయ రైల్వే అందిస్తోంది.

రాత్రి సమయాల్లో రైలు ప్రయాణాలలో ఇబ్బంది పడే ప్రయాణికుల కోసం రైల్వే సౌకర్యం
అయితే చాలా మంది ప్రయాణికులకు రైల్వే అందిస్తున్న వివిధ సేవల గురించి తెలియక పోవడం వల్ల వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. గత కొంతకాలం నుంచి రైల్వే లో రాత్రి సమయాల్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు వారి గమ్యస్థానాలకు సంబంధించిన అలర్ట్ ఫీచర్ అందుబాటులో ఉంచింది రైల్వే. అయితే ఈ ఫీచర్ గురించి చాలామందికి తెలియక పోవడం వల్ల తాము చేరుకోవలసిన గమ్యస్థానం విషయంలో, నిద్రపోకుండా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నిత్యం పరిశీలించుకుంటూ ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి.

రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేసే వారికి రైల్వే అద్భుతమైన ఫీచర్
ఇక రాత్రి వేళల్లో బోగిలలో లైట్లన్నీ ఆర్పి ఉండటం, సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లు వేగంగా వెళ్లడం కారణంగా తమ ప్రయాణం చేస్తున్న రైలు ఏ స్టేషన్ కి వెళ్ళింది అనేది కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. ఇక ఈ పరిస్థితి లో నిద్ర లేకుండా తాము దిగాల్సిన స్టేషన్ కోసం టెన్షన్ పడే రైల్వే ప్రయాణికులకు ఓ అద్భుతమైన అలర్ట్ ఫీచర్ అందుబాటులో ఉంది అన్న విషయాన్ని రైల్వే పదేపదే తెలియజేస్తుంది.

డెస్టినేషన్ అలెర్ట్ తో గమ్యస్థానం రాక ముందే ఫోన్ కు కాల్
ఇక ఆ ఫీచర్ విషయానికి వస్తే డెస్టినేషన్ అలర్ట్ ఫీచర్ లో రైల్వే ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకునే ముందు అప్రమత్తంగా ఉండడానికి ఈ సర్వీస్ రూపొందించబడింది . ఈ సేవలో భాగంగా వినియోగదారులు తమ గమ్యస్థానానికి 20 నిమిషాల ముందు మెసేజ్ ను మరియు రిమైండర్ కాల్ ను అందుకుంటారు. దీనికి మొబైల్ ఫోన్ నుండి 139 డయల్ చెయ్యాలి. ఆ తర్వాత వారు చెప్పే ఇన్స్ట్రక్షన్ ను ఫాలో అవుతూ నచ్చిన భాషను ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత ఐవీఆర్ మెయిన్ మెనూ లో ఏడు సంఖ్యను ఎంపిక చేసుకోవాలి. ఆపై గమ్యం హెచ్చరిక ఎంపిక కోసం రెండు నొక్కాలి. గమ్యం హెచ్చరిక కన్ఫర్మేషన్ కోసం 10 అంకెల పిఎన్ఆర్ నెంబర్ ను నమోదు చేసి 1 నొక్కాలి. ఇక ఈ ప్రక్రియ పూర్తి కాగానే మీ ప్రయాణం కోసం గమ్యస్థాన హెచ్చరిక ప్రారంభించబడుతుందని చెబుతున్నారు.

రైళ్లలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 7 గంటల మధ్య అందుబాటులో డెస్టినేషన్ ఫీచర్
అయితే ఈ గమ్యస్థాన అలర్ట్ ను స్వీకరించడానికి ప్రయాణం చేస్తున్న వారు తమ మొబైల్ ఫోన్ నుంచి మాత్రమే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ సదుపాయం సుదూర ప్రయాణాలు చేసే రైళ్లలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 7 గంటల మధ్య అందుబాటులో ఉంటుంది. ఇక ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని ప్రయాణం చేస్తే రైల్లో నిద్రపోకుండా టెన్షన్ గా గమ్యస్థానం కోసం నిరీక్షించే బాధ తప్పుతుంది. మరింకెందుకాలస్యం ఇకనైనా రాత్రి సమయంలో రైలు ప్రయాణం లో ఎలాంటి టెన్షన్ లేకుండా డెస్టినేషన్ అలర్ట్ పెట్టుకొని హాయిగా నిద్రపోండి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications