రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... టికెట్లపై 75 శాతం డిస్కౌంట్
భారతీయ రైల్వే నెట్ వర్క్ పరంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలుస్తోంది. ప్రతిరోజు 13,600 రైళ్ల ద్వారా రెండు కోట్ల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తోంది. సరకు రవాణాద్వారా అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తుండగా, ప్రయాణికులద్వారా వచ్చే ఆదాయం రెండో స్థానంలో నిలుస్తోంది. ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్న రైల్వే కాలానికి అనుగుణంగా మారుతూ వస్తోంది. ఈ క్రమంలోనే మానవతా దృక్పథంతో కూడా వ్యవహరిస్తోంది. కొంతమంది ప్రయాణికులకు రైలు టికెట్ ధరల్లో 75 శాతం రాయితీ కల్పిస్తోంది.
అనారోగ్యంతో బాధపడేవారికి
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు, థలసేమియా, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, గుండె వ్యాధులు, ఎయిడ్స్, టీబీ, హీమోఫీలియా, అప్లాస్టిక్ అనీమియా, అనీమియా, పూర్తిగా వినలేనివారు, మాట్లాడలేనివారికి, దృష్టిలోపం ఉన్నవారికి, మానసిక వికలాంగులకు, పీడబ్ల్యూడీ కేటగిరిలో ఉన్నవారికి టికెట్ ధరలపై 75 శాతం రాయితీ కల్పిస్తోంది. స్లీపర్, జనరల్, థర్డ్ ఏసీలో ప్రయాణం చేస్తే 75 శాతం రాయితీ ఇస్తారు. సెకండ్ ఏసీ, మొదటి ఏసీలో ప్రయాణం చేస్తే 50 శాతం రాయితీ ఉంటుంది. ఒకవేళ రాజధాని, శతాబ్ది వంటి రైళ్లల్లో ప్రయాణం చేయాలనుకుంటే 25 శాతం రాయితీ పొందొచ్చు. ఏసీ చైర్ కార్, థర్డ్ ఏసీల్లో ఈ రాయితీ వర్తిస్తుంది. వీరికే కాకుండా వీరివెంట తోడుగా వచ్చేవారికి కూడా రాయితీ ఇస్తారు.

ఎడ్యుకేషన్ టూర్లకు
ఉన్నత విద్యను చదవడం కోసం దేశంలో సుదూరంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు వారు ఎంచుకునే తరగతిని బట్టి టికెట్ ధరపై 50 నుంచి 75 శాతం వరకు రాయితీ లభిస్తోంది. ఎడ్యుకేషన్ టూర్లకు వెళ్లేటప్పుడు, ఇళ్లకు వెళ్లేటప్పుడు వీటిని ఉపయోగించుకోవచ్చు. యూపీఎస్పీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలకు హాజరయ్యే సమయంలో కూడా హాల్ టికెట్ చూపించి టికెట్ ధరపై రాయితీని పొందొచ్చు.












Click it and Unblock the Notifications