వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ వద్దకు ఫడ్నవీస్ - షిండే : పదవుల పంపకం పై ఒప్పందం: రేపే కొత్త ప్రభుత్వం..!!

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం అవుతోంది. ఇప్పుడు సభలో అత్యధిక సీట్లు కలిగిన పార్టీగా బీజేపీ..షిండే వర్గం తో సహా స్వతంత్ర అభ్యర్ధుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటకు సిద్దం అయింది. ఈ మేరకు తమ బలంతో కూడిన వివరాలను అందించేందుకు బీజేపీ నేత..మాజీ సీఎం ఫడ్నవీస్ గవర్నర్ తో భేటీ కానున్నారు. ఆయనతో పాటుగా శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే సైతం ఫడ్నవీస్ తో పాటుగా గవర్నర్ ను కలవనున్నట్లుగా తెలుస్తోంది. శివసేన ప్రభుత్వం మెజార్టీ కోల్పోవటం.. సీఎం థాక్రే రాజీనామాతో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.

షిండేతో కలిసి గవర్నర్ వద్దకు ఫడ్నవీస్

షిండేతో కలిసి గవర్నర్ వద్దకు ఫడ్నవీస్


అందులో భాగంగా.. తిరిగి మూడో సారి ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం సభలో బీజేపీకి 106 మంది సభ్యుల బలం ఉంది. శివసేను చెందిన 39 మంది మద్దతుతో షిండే సైతం గవర్నర్ కు లేఖ ఇవ్వనున్నారు. వీరితో పాటుగా స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు పైనా లేఖ ఇవ్వనున్నారు. గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ తో ఈ ఇద్దరు నేతలు భేటీ అయి.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. వారిద్దరి సమాచారం.. సభలో బలం తెలుసుకున్న తరువాత గవర్నర్ ఫడ్నవీస్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు.

రేపు ప్రమాణ స్వీకారం.. త్వరలో బల పరీక్ష

రేపు ప్రమాణ స్వీకారం.. త్వరలో బల పరీక్ష

ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఫడ్నవీస్ రేపు (శుక్రవారం) ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు జరిగే భేటీ తరువాత గవర్నర్ అధికారికంగా ఫడ్నవీస్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే ఛాన్స్ ఉంది. దీని ద్వారా మహారాష్ట్రలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సీఎంగా ఫడ్నవీస్ .. డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు ఈ ప్రభుత్వంలో కీలక పోర్టు ఫోలియోలు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.

ప్రభుత్వ ఏర్పాటు - పదవులపై అంగీకారం

ప్రభుత్వ ఏర్పాటు - పదవులపై అంగీకారం

ఎంత మందిని తీసుకోవాలి .. ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే దాని పైన ఇప్పటికే ఫడ్నవీస్ - షిండే మధ్య చర్చల్లో ఖరారైనట్లుగా సమాచారం. దీంతో.. గవర్నర్ తో ఈ ఇద్దరు నేతల సమావేశం తరువాత.. ప్రభుత్వ ఏర్పాటుకు అధికారిక ఆహ్వానం .. రేపు కొత్త ప్రభుత్వ ఏర్పాటు వరుసగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో..రాజ్ భవన్ నుంచి వచ్చే ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానంతో పాటుగా సభలో మెజార్టీ నిరూపణకు గవర్నర్ సమయం నిర్దేశించనున్నారు.

English summary
BJP leader Devendra Fadnavis to meet Maharashtra governor Bhagat Singh Koshyari along with Shinde, to stake claim on forming government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X