ఈనెల 15వ తేదీలోగా మంత్రివర్గ విస్తరణ?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన కేబినెట్‌ను విస్తరించబోతున్నారు. కొత్తగా 15 మందిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని తెలుస్తోంది. కొత్తవారిచేత ఈ నెల 15లోపు ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించినట్లు ఇప్పటికే డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు కేబినెట్ విస్తరణలో హోంమంత్రిగా బాధ్యతలు అప్పగించబోతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా సమర్పించారు. జూన్ 30వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణం స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇద్దరే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌సీపీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలు వస్తుండటంతో కేబినెట్ విస్తరణకు మోక్షం కలుగుతోంది.

శివసేన పార్టీ గుర్తు బాణం-విల్లు తమకే కేటాయించాలంటూ షిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల అనర్హత అంశంలాంటివన్నీ కోర్టు విచారణలో పెండింగ్‌లో ఉన్నాయని, తీర్పును వాయిదా వేయాలని ఉద్ధవ్ వర్గం కోరింది. దీనిపై తీర్పును సుప్రీం కోర్టు వాయిదా వేసి ఎన్నికల సంఘానికి పలు సూచనలు జారీచేసింది. అలాగే పత్రాచల్ కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. షిండే వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో మరిన్ని షిండేలు పుట్టుకొస్తారంటూ ఆ పార్టీ నేతలు అధికార పార్టీలను బెదిరిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications