వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాగాంధీ కాళ్ల వద్ద తాకట్టు.. శివసేనపై శివాలెత్తిన ఫడ్నవీస్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ముందు దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో ఆవేశంగా మాట్లాడుతూ శివసేనపై తీవ్రమైన విమర్శలు చేశారు. అధికార దాహంతో సిద్దాంతాలను గాలికి వదిలిందని మండిపడ్డారు. ఫడ్నవీస్‌ సమావేశానికి ముందే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేయడంతో మూడు రోజుల హై డ్రామాకు తెరపడిందనే సంకేతాలు అందాయి. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి రాజీనామా లేఖను సమర్పించడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏమిటంటే..

3రోజుల 8 గంటల సీఎంగా ఫడ్నవీస్: మూడురోజుల ముఖ్యమంత్రుల జాబితా ఇదే..!3రోజుల 8 గంటల సీఎంగా ఫడ్నవీస్: మూడురోజుల ముఖ్యమంత్రుల జాబితా ఇదే..!

ఎన్సీపీ ఎమ్మెల్యేల హామీ వల్లే

ఎన్సీపీ ఎమ్మెల్యేల హామీ వల్లే

ఎన్సీపీ ఎమ్మెల్యేలు మాకు భారీ సంఖ్యలో మద్దతు ఇస్తామని హామీ ఇవ్వడం వల్లే ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధపడ్డాం. కానీ అనూహ్యమైన మార్పులు చోటుచేసుకొన్న తర్వాత మంగళవారం ఉదయం అజిత్ పవార్ వచ్చి మీతో కొనసాగలేమని చెప్పారు. అందుకే రాజీనామాకు సిద్ధపడ్డాం. ఎమ్మెల్యేలను కొనడం మా సంస్కృతి కాదు అని ఫడ్నవీస్ అన్నారు.

ప్రజల పక్షాన గళం

ప్రజల పక్షాన గళం

ఫడ్నవీస్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ప్రజల కోసం ఎనలేని కృషి చేశాం. ప్రజలకు ఏదైతే చేశామో దానికి మేము గర్వపడుతాం. బీజేపీ ఎప్పుడూ ప్రజల పక్షాన గళం వినిపిస్తుంది. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అని ఫడ్నవీస్ అన్నారు. ప్రజల గొంతును అసెంబ్లీలో వినిపించడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు.

శివసేన మోసం చేసింది

శివసేన మోసం చేసింది

మా ప్రభుత్వ పనితీరు చూసే బీజేపీ, శివసేనకు స్పష్టమైన తీర్పును ఎన్నికల్లో ఇచ్చారు. కానీ ఫలితాల తర్వాత శివసేన మమల్ని మోసం చేసింది. మహారాష్ట్ర ప్రజలు కోరుకొన్న విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించాం. కానీ శివసేన మా బంధానికి తూట్లు పొడిచింది అని ఫడ్నవీస్ తెలిపారు.

శివసేన బ్లాక్ మెయిల్‌తో

శివసేన బ్లాక్ మెయిల్‌తో

శివసేన సీఎం పదవిపై మాతో బేరసారాలు ఆడింది. ఈ విషయంలో బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించింది. మాతో సంప్రదింపులు జరుపుతూనే ఇతర పార్టీలతో చర్చలు జరిపింది. మేము ఎమ్మెల్యేలను కొంటున్నామని ఆరోపించిన వాళ్లే ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచారు. సుస్థిర ప్రభుత్వానికి అడ్డంకిగా మారారు అని ఘాటైన విమర్శలు చేశారు.

సోనియా కాళ్ల వద్ద హిందుత్వ

సోనియా కాళ్ల వద్ద హిందుత్వ

అధికారం కోసం శివసేన వెంపర్లాడుతున్నది. వారి సిద్ధాంతాలకు విరుద్ధంగా సోనియాగాంధీతో చేతులు కలిపింది. అంతేకాకుండా హిందుత్వ భావనను సోనియా గాంధీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య సిద్ధాంతపరంగా అనేక వైరుధ్యాలు ఉన్నాయి అని ఫడ్నవీస్ పేర్కొన్నారు.

English summary
Maharashtra former CM Devendra Fadnavis fires on Shiv Sena. Fadnavis said, The Shiv Sena's Hindutva now rests at the feet of Congress president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X