ఫడ్నవీస్ మంచి నిర్ణయాలు, మోడీ, షాను కలుస్తా: సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం)కు చెందిన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం సాయంత్రం ఆర్దర్ రోడ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలో గురువారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్న మంచి నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
గత 100 రోజుల్లో తాను ఎదుర్కొన్న విషయాలను తెలియజేయడానికి త్వరలో ఢిల్లీలో ఫడ్నవీస్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలుస్తానని రౌత్ చెప్పారు. పత్రా చాల్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో ప్రమేయం ఉన్నందున రౌత్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో నిన్నటి వరకు ఉన్నారు. రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆగస్టు 1న అతని సహాయకుడు ప్రవీణ్ రౌత్‌తోపాటు అరెస్టు చేసింది.

తనకు ఎవరిపైనా పగ లేదని పేర్కొన్న రౌత్.. "కేంద్ర సంస్థలు లేదా ప్రభుత్వంపై నేను ఎవరినీ విమర్శించను లేదా మాట్లాడను. నేను బాధపడ్డాను. వ్యతిరేకించడం కోసమే మేము ఎవరినీ వ్యతిరేకించము. వారు మంచి పని చేసి ఉంటే మేము కూడా వారిని అభినందిస్తాము, స్వాగతిస్తాము. ప్రస్తుత డిస్పెన్సేషన్ కూడా కొన్ని మంచి పని చేసిందని అన్నారు.
దేశానికి లేదా రాష్ట్రానికి మేలు చేసే నిర్ణయాలను స్వాగతించాలి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నాను. నేను త్వరలో ఫడ్నవీస్‌ను కలుస్తాను అని సంజయ్ రౌత్ అన్నారు. రాజకీయ నాయకుల మధ్య వైషమ్యాలు అంతం కావాలనే ఫడ్నవీస్ స్టాండ్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కూడా కలుస్తారా? అని అడిగ్గా.. ఫడ్నవీస్ చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారని, ఆయనతో కొంత పని ఉన్నందున ఆయనను కలుస్తానని రౌత్ చెప్పారు.
త్వరలో కేంద్ర మంత్రి షా, ప్రధాని మోడీని కూడా కలుస్తానని రౌత్ తెలిపారు. "నాతో ఏమి జరిగిందో నేను వారికి చెప్తాను. నేను ఒకరిని కలుస్తున్నాను అంటే నేను మెతక వైఖరి తీసుకున్నానని కాదు అని చెప్పారు.
తన అరెస్టు చట్టవిరుద్ధమని రాజ్యసభ ఎంపీ అన్నారు. కోర్టు కూడా అదే చెప్పిందన్నారు. "నాపై కుట్ర పన్నిన వారు సంతోషంగా ఉంటే వారు సంతోషంగా ఉండనివ్వండి. నేను బాధపడ్డాను.. బ్రిటీష్ హయాంలో కూడా ఇలాంటి డర్టీ పాలిటిక్స్ పట్టలేదు" అని రౌత్ తెలిపారు.
గురువారం రౌత్.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ఆయన సిల్వర్ ఓక్ బంగ్లాలో.. సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను మాతోశ్రీలో కలవనున్నారు. మరికొంతమందిని కూడా కలుస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications