హెలికాప్టర్ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడిన ఫడ్నవీస్

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: హెలిక్యాప్టర్ ప్రమాదం నుండి మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం నాడు తృటిలో తప్పించుకొన్నారు. చివరి నిమిషంలో పైలెట్ హెలికాప్టర్‌ను సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.

ముంబయికి సమీపంలోని మీరా రోడ్‌లో గురువారం ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్‌ ఆవరణలో హెలికాఫ్టర్‌ ల్యాండ్‌ కావాల్సిఉండగా, అక్కడ వైర్‌ ఉండటాన్ని గుర్తించిన పైలట్‌ చాపర్‌ను వెనుకకు మళ్లించాడు.

Devendra Fadnavis, Nitin Gadkari have a narrow escape; helicopter mishap averted

సమీప ప్రాంతంలోని మరో చోట హెలికాఫ్టర్‌ను సురక్షితంగా ల్యాండ్‌ చేశాడు.హెలికాఫ్టర్‌ ప్రమాదాల నుంచి బయటపడటం ఫడ్నవీస్‌కు ఇదే తొలిసారి కాదు. గత ఏడాది జులైలోనూ ఆయన హెలికాఫ్టర్‌ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

మే 2017లో సీఎం ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ లాతూర్‌లో క్రాష్‌ ల్యాండింగ్‌ అయింది. అదే నెలలో గడ్చిరోలిలో దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ సాంకేతిక కారణాలతో టేకాఫ్‌ తీసుకోవడంలో విఫలమైంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Maharashtra Chief Minister Devendra Fadnavis and Union Minister Nitin Gadkari had a narrow escape on Thursday. The Bharatiya Janata Party (BJP) leaders were going in a helicopter to attend an event in Mira Road near Mumbai.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి