వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Dezerv: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులపై విశ్లేషణాత్మక సమాచారం ఇచ్చిన సందీప్ జెఠ్వాని

|
Google Oneindia TeluguNews

ముంబై: ఈ మధ్యకాలంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనంలో కొనసాగుతోండటమే దీనికి కారణం. 60,000 పాయింట్ల వరకు ఉన్న సెన్సెక్స్ ప్రస్తుతం 52,000 పాయింట్లకు దిగువన ట్రేడింగ్ అవుతోంది. డ్రైవింగ్ ఫోర్స్‌గా భావించే అన్ని కీలక సెగ్మెంట్స్‌కు చెందిన షేర్ల ధరలన్నీ క్షీణించాయి. స్టాక్స్ ధరలు క్షీణించినప్పుడు కొనుగోలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా రిటైల్ ఇన్వెస్టర్లల్లో వ్యక్తమౌతుంటుంది.

మార్కెట్స్ మళ్లీ కోలుకున్నప్పుడు ఆకాశానికి ఎగబాకే షేర్లను ఎంపిక చేసుకోవడం ఓ అగ్నిపరీక్షే. దీనిపై ప్రముఖ వెల్త్ మేనేజ్‌మెంట్ స్టార్టప్ డిజర్వ్ సహ వ్యవస్థాపకుడు సందీప్ జెఠ్వాని కీలక సమాచారాన్ని ఇచ్చారు. వన్ ఇండియాకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. స్టాక్ మార్కెట్స్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్లపై అవగాహన కల్పించారు. ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్స్, పెట్టుబడుు పెట్టడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరణాత్మక ఇంటర్వ్యూ ఇది.

Dezerve co-founder Sandeep Jethwani given information on alternative investments and basics

ప్రశ్న: 25 సంవత్సరాల మేర పెట్టుబడులు పెట్టాలనుకునే వారు- మూడు కీలక అంశాల గురించి తెలుసుకోవాల్సింది ఏమిటి? తన ప్రత్యామ్నాయ పెట్టుబడుల ద్వారా ప్రతినెలా 15 శాతం వరకు ఆదాయాన్ని ఆర్జించాలనుకునే ఇన్వెస్టర్లకు ఇచ్చే సూచనలు ఏమిటి?

సందీప్ జెఠ్వాని: ప్రత్యామ్నాయ పెట్టుబడుల్లో అస్సెట్స్ క్లాస్ లేదా ఇన్‌స్ట్రుమెంట్స్‌ గురించి తెలుసుకోవాలి. వెంచర్ కేపిటల్స్, ప్రైవేట్ ఈక్విటీ, ఫ్రీ-ఐపీఓ, సెక్యూరిటీస్, హేజ్ ఫండ్స్, కమోడిటీ లింక్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వంటి గోల్డ్ ఈటీఎఫ్ లేదా సావెర్నిటీ గోల్డ్ బాండ్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ట్రస్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్, మార్కెట్ లింక్డ్ డిబెంచర్స్‌, ఎన్ఎఫ్‌టీతో పాటు క్రిప్టోకరెన్సీని కూడా ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్స్‌గా భావించుకోవచ్చు.

ప్రత్యామ్నాయ పెట్టుబడులు పెట్టే సమయంలో కొన్ని విషయాలను ప్రధానంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది:

1. మొదటిది- సంప్రదాయబద్ధంగా వస్తోన్న పెట్టుబడులకు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి ఎలా భిన్నమైనవి అనే విషయంపై క్షున్నంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్స్ హారిజెన్స్, లిక్విడిటీ, మనకు వచ్చే రిటర్న్, రిటర్న్న్ ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్స్ బేసిక్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాల్సి ఉంటుంది.

2. రెండో అంశం.. రిస్క్ మేనేజ్‌మెంట్: ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. రిస్క్ మేనేజ్‌మెంట్‌పై అందుబాటులో ఉన్న పాత డేటా కూడా పరిమితమే. అందుకే- ఈ సెగ్మెంట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు అనుక్షణం మార్కెట్స్‌ ఒడిదుడుకుల గురించి అప్రమత్తంగా ఉండాలి.

3. పోస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ మానిటరింగ్: ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టాలకునే వారు.. షేర్ మార్కెట్స్ ఎత్తుపల్లాలు, రెగ్యులేటరీ నియమాలతో పాటు తరచూ రీ-బ్యాలెన్సింగ్, సెబి తీసుకునే మానిటరింగ్‌ చర్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అన్నింటికీ మించి- ఇన్వెస్టర్లు తమ అస్సెట్స్‌పై పూర్తిస్థాయి అవగాహనను ఏర్పరచుకోవాలి.

ప్రశ్న: మార్కెట్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే కొత్త గ్రాడ్యుయేట్స్‌కు మీరు ఇచ్చే సలహాలు ఏమిటీ?

సందీప్ జెఠ్వాని: ఈ విషయంలో అథెంటిఫికేషన్, బేసిక్స్‌పై పూర్తిస్థాయి అవగాహనను తెచ్చుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్స్‌పై బేసిక్స్ గురించి నేర్చుకోవడానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్, డైవర్సిఫికేషన్స్, దీర్ఘకాలిక పెట్టుబడులు, నిపుణులు ఇచ్చే సూచనలు-సలహాల గురించి తెలుసుకోవడం అవసరం. Dezerv దీనిపై పలు సౌకర్యాలను కల్పించింది. బ్లాగ్ ఆర్టికల్స్, న్యూస్ లెటర్స్, ఎక్స్‌ప్లెయినర్ సిరీస్, ఇన్‌సైడర్ ఇన్వెస్టింగ్ ప్రొడక్ట్స్ వంటి మాధ్యమాల ద్వారా ప్రజలకు ఇన్వెస్ట్‌మెంట్స్, పర్సనల్ ఫైనాన్స్‌పై శిక్షణ ఇస్తోంది. అవన్నీ- Dezerv యూట్యూబ్ ఛానల్, వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.

వీటితో పాటు షేర్ మార్కెట్స్‌లో ఏర్పడే ఒడిదుడుకులు, కంపెనీలపై పూర్తిస్థాయి అవగాహనను ఏర్పరచుకోవాలి. దీనికోసం సమయాన్ని కేటాయించడం అత్యవసరం. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. మార్కెట్ ఎత్తుపల్లాల్లో ఉన్నప్పటికీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఆలోచించాలి. పెట్టుబడులు పెట్టేముందు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్‌ల నుంచి సలహాలు తీసుకోవాలి. ఇన్వెస్టర్లు తమ ఆర్థిక స్థోమతను సైతం దృష్టిలో పెట్టుకోవాలి.

ప్రశ్న: మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ మధ్య తేడా ఏంటీ? ఈ రెండింటి మధ్య పెట్టుబడుల మధ్య ఉన్న విభజన ఎలాంటిది?

సందీప్ జెఠ్వాని: ఈ రెండు ఛానల్స్ కూడా విభిన్న రకాల్లో ఇన్వెస్ట్‌ చేయదగ్గవి. వేర్వేరు అసెట్స్ క్లాస్‌కు చెందినవి. మ్యూచవల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు ఒక గ్రూప్ నుంచి ఫండ్స్‌ను సమీకరించుకోవడం, వాటిని స్టాక్, బాండ్, మరో అసెట్స్‌ క్లాస్‌లో పెట్టుబడిగా బదలాయించడం ఉంటుంది. ఇందులో ఫండ్స్ మేనేజ్‌మెంట్ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) సెక్యూరిటీస్ అనేవి ప్రత్యేకంగా ఏదైనా ఒక ఇండెక్స్, సెక్టార్, కమోడిటీకి సంబంధించినది. అవి నేరుగా ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతుంటాయి.

ప్రశ్న: క్వాంటిటేటివ్ బెస్ట్ ఇన్వెస్ట్స్ ఎలా పని చేస్తాయి? మీరు ఎలాంటి డేటా సెట్ మీద ఆధారపడతారు?

సందీప్ జెఠ్వాని: క్వాంటిటేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఓ దృష్టికోణం. అత్యున్నత ప్రమాణాలతో కూడిన డేటాతో ఈ పోర్ట్‌ఫోలియోను విశ్లేషించాల్సి ఉంటుంది. ఆప్టికల్ అస్సెట్స్ అలాట్‌మెంట్స్‌కు సంబంధించిన నిర్ణయాలను పూర్తిస్థాయిలో విశ్లేషించడాన్ని క్వాంటిటేటివ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పరిగణించవచ్చు. వ్యవస్థీకృతమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. డేటా అనలిటిక్స్ ద్వారా వీటిని విశ్లేషిస్తుంటాం. దీని ఆధారంగా మా యూజర్స్‌కు రిస్క్-రికార్డ్ ప్రొఫైల్‌ను ప్రిపేర్ చేస్తుంటాం.

Dezervలో పోర్ట్‌ఫోలియోలను క్రియేట్ చేయడానికి బ్లాక్-లిటర్‌మెన్ మోడల్‌ వంటి అత్యాధునిక పోర్ట్‌ఫోలియో సైన్స్, క్వాంటిటేటివ్ ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగిస్తుంటాం. ఏఎంసీ, ఫండ్ మేనేజర్ పెడిగ్రీ, హిస్టారికల్ పోర్ట్‌ఫోలియో పెర్ఫార్మెన్స్, మైక్రోఎకానమిక్ డేటా, ఫండ్ ఏయూఎం, క్రెడిట్ క్వాలిటీ, వాల్యుయేషన్ మెట్రిక్ వంటివి వినియోగిస్తుంటాం. దీని అల్గోరిథమ్ భిన్నంగా ఉంటుంది. దీన్ని రెకమెండ్ చేసే ముందు.. పూర్తిస్థాయిలో పరిశీలిస్తుంటాం.

ప్రశ్న: టయర్-2 వంటి ప్రాంతాల్లో నివసించే ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై అవగాహన, చైతన్యాన్ని కల్పించడానికి మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?

సందీప్ జెఠ్వాని: గ్రామాల్లో నివసించే వారికి ఇన్వెస్ట్‌మెంట్స్, మార్కెట్స్‌పై అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్, ఆధార్, మొబైల్ ట్రినిటీపై పని చేస్తోంది. ఆర్బీఐ కూడా తన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మేము విభిన్న డిజిటల్ ఛానల్స్ అంటే.. సోషల్ మీడియా, మా సొంత వెబ్‌సైట్‌తో పాటు మీడియా సహకారంతో ప్రజలకు అవగాహనను కల్పిస్తున్నాం. సొంత యూట్యూబ్ ఛానల్, వెబ్‌సైట్ ఆర్టికల్స్, న్యూస్ లెటర్స్ ద్వారా పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై టయర్ 2 వంటి ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నాం.

ప్రశ్న: 30 సంవత్సరాల వయస్సున్న వారిలో అస్సెట్స్ క్లాస్ గురించి ఎలా ఆలోచింపజేయాలి? ఇమ్మూవబుల్ ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టే విధానాలు ఏమిటి? దీనిపై మీ అభిప్రాయం ఏమిటీ?

సందీప్ జెఠ్వాని: రియల్ ఎస్టేట్స్ వంటి ఇమ్మూవబుల్ ప్రాపర్టీల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు వాటి పట్ల పూర్తిస్థాయి అవగాహనను కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. రియాల్టీలో ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఈ మధ్యే కొన్ని కొత్త పద్ధతులను అన్వేషించాం. ఇందులో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ వంటివి ఉన్నాయి. అవి పూర్తిగా మ్యూచువల్ ఫండ్స్ వంటివే. హోటల్స్, కార్యాలయాలు/అపార్ట్‌మెంట్స్/బిల్డింగ్స్, గిడ్డంగులు వంటితో పాటు వాణిజ్య పరమైన భవనాలను ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కేటగిరీలోకి వస్తాయి. హైవే, పవర్ ప్లాంట్స్, చిన్న, మధ్యస్థాయి రహదారులు, పైప్‌లైన్స్ నిర్మాణం వంటివి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ పరిధిలోకి వస్తాయి.

ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌లో పెట్టుబడులతో పాటు అప్రిషియేషన్ బెనిఫిట్స్ పరిమితంగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా వచ్చే రిటర్న్స్‌పై భరోసా ఉంటుంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోల్లో పెట్టుబడులు.. ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల్లో కూడా లాభాలను అందించే అవకాశం ఉంది. ఇందులో పెట్టుబడులు పెట్టేముందు నిపుణుల సలహాలను తీసుకోవడం తప్పనిసరి.

English summary
Dezerv co founder Sandeep Jethwani has given detailed information about alternative investments, basics before investing in an exclusive interview to OneIndia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X