ఇండిగోకు డీజీసీఏ భారీ షాక్!
గతేడాది డిసెంబర్‌లో భారీ ఎత్తున విమాన సర్వీసుల రద్దు, జాప్యంతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో ఎయిర్ లైన్స్‌పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కొరడా ఝుళిపించింది. ఈ వ్యవహారంలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు గుర్తించిన సంస్థ ఇండిగోకు భారీ జరిమానా విధించింది. 2025 డిసెంబర్‌లో విమాన సర్వీసుల అంతరాయంపై విచారణ పూర్తి చేసిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇండిగో సంస్థపై రూ. 22.20 కోట్ల జరిమానా విధించింది. కేవలం జరిమానానే కాకుండా సంస్థ సీనియర్ మేనేజ్‌మెంట్‌పై కూడా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
అసలేం జరిగింది?
2025 డిసెంబర్ 3 నుండి 5వ తేదీ మధ్య ఇండిగో విమాన సర్వీసులు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. ఆ మూడు రోజుల్లోనే దాదాపు 2,507 విమానాలు రద్దయ్యాయి. మరో 1,852 విమానాలు గంటల తరబడి ఆలస్యమయ్యాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో సుమారు 3 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

విచారణలో తేలిన కారణాలు
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు డీజీసీఏ నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విచారణలో ఇండిగో వైఫల్యాలు స్పష్టంగా వెల్లడయ్యాయి అతి విశ్వాసంతో ఆపరేషన్లను సామర్థ్యానికి మించి ప్లాన్ చేయడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తినట్లు తెలిసింది. విమానయాన సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లు బలహీనంగా ఉన్నట్లు కూడా తేలింది. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో మేనేజ్‌మెంట్ విఫలమైనట్లు కూడా తెలిసింది. .రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం వహించినట్లు కూడా తేలింది.












Click it and Unblock the Notifications