వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర ప్రమాదం: బ్రిడ్జిపైనుంచి నదిలో పడిన బస్సు, 13 మంది మృతి

|
Google Oneindia TeluguNews

భోపాల్: ఇండోర్ నుంచి మహారాష్ట్రలోని పుణె వెళ్తున్న మహారాష్ట్ర రోడ్‌వేస్ బస్సు సోమవారం మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని ఖల్ఘాట్ సంజయ్ సేతు నుంచి నదిలో పడిపోయింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనా స్థలం నుంచి 13 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో 15 మందిని రక్షించినట్లు రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.

ముందస్తు సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదం ఆగ్రా-ముంబై (ఏబీ రోడ్) హైవేపై జరిగింది. ఈ రహదారి ఇండోర్‌ను మహారాష్ట్రను కలుపుతుంది. ఈ ప్రదేశం ఇండోర్ నుంచి 80 కి.మీ దూరంలో ఉంది. ఈ బస్సు సంజయ్ సేతు వంతెనపై నుంచి పడిపోయిన ప్రదేశం ధార్-ఖర్గోన్ జిల్లాల సరిహద్దులో ఉంది.

ఈ ఘటనపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందిస్తున్నారని చెప్పారు. 'మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన బస్సు దుర్ఘటన బాధాకరం. నా ఆలోచనలు వారి ప్రియమైన వారిని కోల్పోయిన వారితో ఉన్నాయి. రెస్క్యూ పనులు జరుగుతున్నాయి, స్థానిక అధికారులు బాధితలకు అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తున్నారు' అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను సీఎం చౌహాన్ ఆదేశించారు. అదనపు బలగాలను తరలించి క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాలన్నారు. జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సీఎం ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు.

Dhar Accident: 13 Dead, 15 Rescued After Pune-Bound Bus Falls Into Narmada River, PM Modi Expresses Grief

మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులుక రూ. 10 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులకు సంతాపం తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ట్విట్టర్‌లో వేదికగా ఘటనపై స్పందించారు. "ధార్ జిల్లాలోని ఖల్‌ఘాట్ వద్ద నర్మదా నదిలో ప్రయాణికులతో నిండిన బస్సు పడిపోవడం గురించి విచారకరమైన వార్త వచ్చింది. ప్రభుత్వం, పరిపాలన సహాయక చర్యలు చేపట్టాలని నేను కోరుతున్నాను. యుద్ధప్రాతిపదికన ప్రజలకు ఉపశమనాన్ని అందించాలి' అని పేర్కొన్నారు.

English summary
Dhar Accident: 13 Dead, 15 Rescued After Pune-Bound Bus Falls Into Narmada River, PM Modi Expresses Grief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X