అన్నామలైని అడ్డుకున్న యువకులు, సార్ కు షాక్, చర్చిలో ఏం జరిగింది ?
కర్ణాటకలో సమర్ధవంతమైన ఐపీఎస్ అధికారిగా, నీతినిజాయితీ కలిగిన పోలీసు అధికారిగా గుర్తింపు పొందిన తర్వాత బీజేపీలో చేరి తమిళనాడులో ఆపార్టీలో చురుగ్గా పనిచేసిన ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలైపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై తమిళనాడులోని ధర్మపురి పోలీసులు కేసు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
బీజేపీ నాయకుడు అన్నామలై మత విద్వేషాలను రెచ్చగొట్టారనే ఆరోపణలతో ధర్మపురిలో కేసు నమోదు చేసినట్లు ప్రముఖ జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. జనవరి 8వ తేదీన పప్పిరెడ్డిపట్టి సమీపంలోని బొమ్మిడి ప్రాంతంలో చర్చిలో ప్రవేశించడానికి అన్నామలై తదితరులు ప్రయత్నించారు ఆ సందర్బలో అన్నామలైకి, క్రైస్తవ మతానికి చెందిన యువకుల మధ్య వాగ్వాదం జరిగింది.

చర్చిలో ప్రవేశించి మేరిమాతకు పూల మాల వెయ్యడానికి ప్రయత్నించిన అన్నామలైని అడ్డుకున్న ఒక వర్గం మీరు మేరిమాతకు పూలమాలలు వెయ్యడానికి వీలులేదని అన్నారు. అదే సమయంలో అన్నామలై తన ర్యాలీ సందర్భంగా పాపిరెడ్డిపట్టిలోని సెయింట్ లూర్ద్ చర్చిలో మేరీ విగ్రహానికి పూలమాల వేయబోతుండగా తోపులాటలతో పాటు ఇరు వర్గాల మధ్య మాటలయుద్దం జరిగింది.
మణిపూర్ హింసాకాండను గురించి అక్కడ చర్చ జరిగింది. తరువాత బీజేపీ లీడర్ అన్నామలైతో పాటు ఆయన బృందాన్ని చర్చిలోకి రాకుండా ఓ వర్గం యువకులు అడ్డుకున్నారు. ఆ సందర్బంలో అన్నామలై మాట్లాడుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నామలై చర్చిలోకి వెళ్లకుండా అడ్డుకున్న ఓ వర్గం దాడికి దిగింది. అది కూడా ఆ వీడియోలో నమోదైంది. డీఎంకే నాయకుల్లా మీరు మాట్లాడొద్దు అని, ఇది పబ్లిక్ ప్లేస్. నన్ను ఆపడానికి మీకు ఏ హక్కు ఉంది? అంటూ అన్నామలై ఆ యువకులను ప్రశ్నించారు.

నేను 10,000 మందిని కూడగట్టి ధర్నా చేస్తే మీరేం ఏం చేస్తారు? అంటూ అన్నామలై ఆ యువకులను ప్రశ్నించిన సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల జోక్యంతో చర్చిలోకి వెళ్లిన అన్నామలై మేరీమాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కార్తీక్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా ధర్మపురి జిల్లా బొమ్మిడి పోలీస్ స్టేషన్‌లో వివిద సెక్షల కింద అన్నామలైతో పాటు ఆయన అనుచరుల మీద కేసులు నమోదు చేశారు.
-
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications