ఇరానీ గ్యాంగ్: రూ. 60 లక్షల గొలుసులు స్వాధీనం
బెంగళూరు: బెంగళూరు నగరంలో విచ్చలవిడిగా చైన్ స్నాచింగ్ లు చేస్తున్న ఇరానీ గ్యాంగ్ లోని ముగ్గురిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 60 లక్షల విలువైన బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
ధారవాడలోని జన్నత్ నగరలోని ఇరానీ కాలనీకి చెందిన అబుజర్ ఆలీ (26) అబ్దుల్ హాసన్ (23), హాసన్ జిల్లాలోని హళే నరసీపురకు చెందిన గిరీష్ (38) అనే ముగ్గురిని అరెస్టు చేశామని సోమవారం బెంగళూరు సీసీబీ పోలీసులు అన్నారు.

నిందితులు మైసూరు నగరంలో రిజిస్టర్ అయిన బ్లాక్ కలర్ పల్సర్ బైక్ ( నెంబర్ కేఎం. ఇబీ-6400) బెంగళూరు తీసుకు వచ్చారు. ఆ బైక్ చోరీ చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. చైన్ స్నాచింగ్ చెయ్యడానికి ప్రయత్నించడంతో పోలీసులు వీరిని వెంటాడి పట్టుకున్నారు.
విచారణలో నిందితులు బెంగళూరు నగరంలోని విజయనగర, కామాక్షిపాళ్య, చంద్రాలేఔట్, చెన్నమ్మనే అచ్చుకట్ట, కంగేరి, హెచ్ఏఎల్, సుబ్రమణ్యనగర, యలహంక, గిరినగర, విద్యారణ్యపుర, సంజయ్ నగర, ఆర్ ఆర్ నగర పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్ లు చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications