రఘురాం రాజన్‍‌కు రాజ్యసభను ఆఫర్ చేసిన ఆమ్ అద్మీ పార్టీ?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను రాజ్యసభకు పంపే యోచనలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.

ఆయనకు ఏఏపీ రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఏపీ ఘన విజయం సాధించంది. 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్‌ 66 సీట్లు గెలుపొందింది.

Did AAP offer Rajya Sabha seat to Raghuram Rajan?

దీంతో ఢిల్లీ వాటాలో ఏఏపీకి మూడు రాజ్యసభ సీట్లు వచ్చాయి. ఈ సీట్లు 2018 జనవరికి ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఏపీ సభ్యుల ఎంపిక ప్రారంభించింది.

అయితే పార్టీ నేతలకు కాకుండా బయటి వ్యక్తులు, ప్రముఖ నిపుణులకు ఈ సీట్లు ఇచ్చేందుకు ఆ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే రఘురాం రాజన్‌కు సీటు ఆఫర్‌ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై రాజన్‌ నుంచి అధికారిక స్పందన రాలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Governor of Reserve Bank of India, Raghuram Rajan, has been reportedly offered a Rajya Sabha seat from Delhi by Aam Aadmi Party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి