Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

India Vs Bharat : 74 ఏళ్ల క్రితమే పరిష్కారం చూపిన అంబేద్కర్ ? ఆరోజు జరిగిదిందే..!

భారత్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు దేశం పేరు మార్పు చర్చ నడుస్తోంది. ముఖ్యంగా కేంద్రం వచ్చే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరును భారత్ గా మార్చే బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా వర్సెస్ భారత్ చర్చకు సుదీర్ఘ చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది 1949లోనే ఈ చర్చ రాజ్యాంగ సభ ముందుకు వచ్చినప్పుడు రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దీనికి పరిష్కారం చూపారనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
జాతీయ మీడియా నెట్ వర్క్ ఇండియా టుడే అప్పుడేం జరిగిందన్న అంశంపై తాజా కథనంలో ఆసక్తికర విషయాలు పేర్కొంది.

సెప్టెంబరు 18, 1949 అంటే 74 సంవత్సరాల క్రితం మన దేశంలోని కొంతమంది మేథావులు దేశాన్ని ఇండియాగా పిలవాలా లేక భారత్ గా పిలవాలా అన్న విషయంలో వాగ్వాదాలకు దిగేవారు. అయితే ఏడు దశాబ్దాలు దాటినా ఈ చర్చ ఇంకా కొనసాగుతోంది. స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలనే డిమాండ్ భారత స్వాతంత్ర్య పోరాటంలో వచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి. బ్రిటీష్ ప్రభుత్వం నుండి భారతీయులకు అధికార మార్పిడి గురించి చర్చించడానికి 1946లో క్యాబినెట్ మిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు, రాజ్యాంగ పరిషత్తు మొదట సృష్టించారు.

India Vs Bharat

1946 డిసెంబరు 9న రాజ్యాంగ పరిషత్తు మొదటిసారి సమావేశమైంది. ఆ తర్వాత 2 సంవత్సరాల 11 నెలల కాలంలో 166 రోజుల తీవ్ర చర్చలతో కూడిన మొత్తం 11 సమావేశాల తర్వాత భారత రాజ్యాంగాన్ని రూపొందించే పనిని అసెంబ్లీ పూర్తి చేసింది. అసెంబ్లీ మొట్టమొదట డిసెంబర్ 1946లో సమావేశమైనప్పటికీ, సెప్టెంబర్ 18, 1949 వరకు దేశానికి ఒక పేరును ఖరారు చేయలేకపోయింది. సెప్టెంబర్ 18, 1949 ఉదయం ఢిల్లీలోని రాజ్యాంగ మందిరంలో భారత రాజ్యాంగ సభ సమావేశమైనప్పుడు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

సెప్టెంబర్ 17, 1949 అంటే ప్రస్తుత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ఆమోదించబడటానికి ఒక రోజు ముందు చాలా కీలకమైంది.
అప్పటి న్యాయ, న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 1 ఆమోదం అదే రోజు జరగాలని కోరుకున్నారు. కానీ రాజ్యాంగ సభలో కొందరు ప్రతినిధులు మాత్రం ఓటింగ్ కు ముందు చర్చకు పట్టుబట్టారు. అంబేద్కర్ ఆర్టికల్ 1ని ఇండియా, అంటే భారత్ అనే పదాలతో మొదలుపెట్టాలని సూచించారు. దీనిపై సభ్యులు తమ అభిప్రాయాలు రికార్డు చేయాలని కోరారు.

సెప్టెంబర్ 18, 1949న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశమైనప్పుడు సెంట్రల్ ప్రావిన్స్ మరియు బేరార్‌కు చెందిన హెచ్.వి.కామత్ మొదట ప్రసంగించారు. ఇది నవజాత భారత రిపబ్లిక్ యొక్క నామకరణ వేడుక అని తెలిపారు. ఆ సమయంలో భారత్, హిందుస్థాన్, హింద్, భరత్భూమి లేదా భరతవర్ష్ అనే పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో అసలు అప్పుడే పుట్టిన (స్వాతంత్రం తెచ్చుకున్న )బిడ్డకు కొత్తగా పేరెందుకు ఇండియా పేరు సరిపోతుందన్నారు. అలాగే ఇండియా పేరు సరిపోతే నామకరణ వేడుక అక్కర్లేదన్నారు. కానీ ఎవరైనా ప్రత్యామ్నాయ పేరు కావాలంటే వేదాల్లో దుష్యంతుడు, శకుంతల కుమారుడైన భరత్ అని పెట్టొచ్చని సూచించారు.

India Vs Bharat

దీనిపై అంబేద్కర్ అసహనం వ్యక్తం చేస్తూ ఇదంతా అవసరమా అన్నారు. కానీ కామత్ పట్టు వీడలేదు. ఇండియా అనే పేరు పెట్టి, అంటే భారత్ అనే పదాలు కూడా ఆర్టికల్ 1కి కలపాలన్నారు. ఆ తర్వాత మిగతా సభ్యులు కూడా కొందరు భారత్ అని, మరికొందరు ఇండియా అని అభిప్రాయాలు చెప్పారు. చివరికి అంబేద్కర్ కామత్ సూచించిన ఇండియా, అంటే భారత్ అనే పదాలతో ఆర్టికల్ 1ను మొదలుపెట్టడాన్ని ఫైనల్ చేశారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+