బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

I am sorry, నేను ఏమీ చెయ్యలేను, ఇది మాజీ సీఎం సిద్దూ మాట , హైకమాండ్ ఎంట్రీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయాలను ఓ కొలిక్కి తీసుకురావడం తనకు సాధ్యం కాదని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాంగ్రెస్ హైకమాండ్ కు తేల్చి చెప్పారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాజీమానా చేసిన ఎమ్మెల్యేలకు నచ్చచెప్పి తాను విసిగిపోయానని సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారని సమాచారం.

Recommended Video

ఎంపీలకు విందు ఇవ్వనున్న ప్రధాని మోదీ

ఆషాడ మాసం అనికూడా చూడకుండా ఒక్కసారిగా రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలు చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాజీ సీఎం సిద్దరామయ్యకు ఫోన్ చేసి అసలు ఏం జరిగింది ? అని ఆరా తీసిందని తెలిసింది.

Did former CM Siddaramaiah said, I am sorry, I am helpless to Congress High Command?

వెంటనే రెబల్ ఎమ్మెల్యేలతో సంప్రదించి వారి రాజీనామా లేఖలు వెనక్కి తీసుకోవాలని నచ్చ చెప్పాలని మాజీ సీఎం సిద్దరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ సూచించిందని తెలిసింది. అయితే హైకమాండ్ తో మాట్లాడిన సిద్దరామయ్య ఐయామ్ సారి, నేను ఏమీ చెయ్యలేను అని తేల్చి చెప్పారని సమాచారం.

కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకమైన నాయకుడు, మాజీ హోం మంత్రి రామలింగా రెడ్డి సైతం రాజీనామా చెయ్యడంతో ప్రస్తుతం తాను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నానని సిద్దరామయ్య హైకమాండ్ కు చెప్పారని సమాచారం. మాజీ సీఎం సిద్దరామయ్య చేతులు ఎత్తేయడంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్ బెంగళూరు బయలుదేరారు.

English summary
Did former CM Siddaramaiah said, I am sorry, I am helpless to Congress High Command?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X