రఫెల్ సాంకేతిక అంశాలు ఇక రహస్యమేమి కాదా , అంతా పాకిస్తాన్ కు చేరిపోయిందా?
అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న రఫెల్ యుద్ద విమానాల రహస్యలు బట్టబయలు కానున్నాయా,ఇప్పటికే వాటి కోనుగోలుపై పలు కీలక పత్రాలు చోరీకి గురయ్యాని చెబుతున్న నేపథ్యంలో రఫెల్ విమానాలకు సంభంధించి మరో వివాదం బయటకు వచ్చింది.దీంతో భారత్ కు రానున్న రఫెల్ విమానాలకు సంభంధించి, ఇప్పటికే 2017 లోనే పాకిస్తాన్ పైలట్లు శిక్షణ పొందినట్టు ఫ్రాన్స్ కు చెందిన ఎయిన్ఆన్‌లైన్.కామ్ అనే పత్రిక ఓ కథనాన్ని వెలువరించింది. అయితే దీనిపై తమకు ఎలాంటీ సమాచారం లేదని భారత్ లోని డసో ఏవియోషన్ ప్రతినిధులు తెలిపారు.

ఎయిన్ఆన్‌లైన్.కామ్ కథనం ప్రకారం
ఫ్రాన్స్ కు చెందిన ఎయిన్ఆన్‌లైన్.కామ్ పత్రిక వైమానిక రంగానికి సంబంధించిన వార్తలను అందిస్తోంది.ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ పాకిస్తాన్ కు చెందిన పైలట్‌లు పరస్పర మార్పిడిలో భాగంగా ఖతార్ లో రఫెల్ యుద్ద విమానాలను నడిపేందుకు 2017 లోనే శిక్షణ పోందినట్టు తన కథనంలో పేర్కోంది. కాగా ఈ యుద్దవిమానాలు నడిపేందుకు ఫ్రాన్స్ లో శిక్షణ ఇచ్చారు.కాగా ఇదే విషయం పత్రిక వెల్లడించింది.

పాక్ పైలట్లు శిక్షణ పోందితే భారత్ కు ఎందు కు నష్టం
కొద్ది రోజుల్లో రఫెల్ యుద్ద విమానాలు భారత్ చేరుకోనున్నాయి. కాగా ఇవి ఆధునిక యుద్ద విమానాలు, వీటిలో అత్యాధునిక రాడార్లు అత్యంత కీలకమైనవి .భారత దేశం కొనుగోలు చేసే రఫేల్ యుద్ద విమానాల్లో ఆర్‌బీఈ -2 ఏఈఎస్‌ఏ రాడార్ ఉంది. కాగా పాకిస్తాన్ ఫైలట్లు నడపబోయో ఖతార్ కొనుగోలు చేసిన విమానాల్లో కూడ ఇదే రకమైన రాడార్ ఉంది. దీంతో పాక్ పైలట్లు వీటీపై శిక్షణ పోందడంతో రఫెల్ విమానాల పనితీరు, వాటి బలాబలాలు వారికి పూర్తిగా తెలిసి ఉంటాయి.ఒకరకంగా వాటి పూర్తి సమాచారం పైలట్లు అవగాహన కల్గిఉంటారు.

విమానాల్లో రాడార్ల సమాచారం కీలకం
ఈనేపథ్యంలోనే యుద్దవిమానాల్లో రాడార్లు ఎంత దూరం నంచైనా శత్రువును పసిగట్టలవు. రాడార్లు విమానం చుట్టుపక్కల ఏమేరకు కవర్ చేయగలవు, దీంతో రఫెల్ వివరాలు పాక్ పైలట్ల చేతిలో పడడంతో భవిష్యత్ లో భారత్ ,పాకిస్తాన్ ల మధ్య యుద్దం నెలకొన్న పరిస్థితుల్లో పాకిస్థాన్ వీటి నుండి రక్షించుకునేందుకు జాగ్రత్తపడే అవకాశం ఉంది. కాగా శుత్రువులను గుర్తించే స్ప్రెక్ట్రా వ్యవస్థ కూడ రఫేల్ లో ఉంది.

ఖతార్ వద్ద రఫెల్ విమానాలు ఎక్కడివి
ఖతార్ దేశం 2015 లో 24 రఫేల్ విమానాలు కొనుగోలుకు డసో ఏవియోషన్ తో ఒప్పందం చేసుకుంది. దీంతో పాటు వీటికి అదనంగా 2017 డిశంబర్ లో కూడ మరో12 విమానాలకు అర్డర్ చేసింది.కాగా మొదటి సారి ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని రఫేల్ విమానాలను 2019 ఫిబ్రవరి డెలివరీ చేశారు.

ఖతార్ విమానాలు పాకిస్థాన్ ఎందుకు నడుపుతుంది ?
కాగా మధ్యప్రాశ్చ్యం పలు దేశాల్లో అత్యధునిక విమానాలతోపాటు, ఆయుధాలను వినియోగించడానికి పాకిస్తాన్ తన సైనికులను నియమిస్తుంది. ఈమేరకు ఆయా దేశాల మధ్య ఒప్పందాలు చేసుకుంటాయి.కాగా ఇది కొన్ని దశాబ్దాలుగా ఈ విధానం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆయా దేశాలు కోనుగోలు చేసిన అత్యాదునిక ఆయుధాలను తిరిగి కొనుగోలు చేస్తుంటుంది. కాగా ఖతార్ ,పాకిస్తాన్ దేశాల మధ్య ఇలాంటీ ఓప్పందం ఉంది .దీంతో పాక్ సైనికులు రఫేల్ విమానాలు నడిపేందుకు శిక్షణ పొందుతున్నారు.

ఇది నిజమైన వార్త కాదు,ఫ్రాన్స్ అంబాసిడర్
ఎయిన్ఆన్‌లైన్.కామ్ కథనం ఫ్రాన్స్ ఇండియా లో ఫ్రాన్స్ అంబాసిడర్ అలెగ్జండర్ ఈ కథనంపై స్పందించారు.పాకిస్తాన్ కు చెందిన పైలట్లు ఎవ్వరు కూడ రఫేల్ జెట్స్ నడిపేందుకు శిక్షణ తీసుకోలేదని తెలిపారు.కాగా ప్రచురించిన కథనం ఫేక్ న్యూస్ అంటూ ట్వీట్ చేశారు.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications