జమ్మూ కాశ్మీర్ ఇండియాలో భాగం కాదని మీకు తెలుసా..? ఎలా కలుపుకున్నారంటే..!

కాశ్మీర్‌లోని పహల్గామ్‌‌లో ఉగ్రవాదుల దాడి గురించి తెలిసిన విషయమే.ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన 28 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరుకున్నారు. వారి ఆనందపు కేరింతలు కాస్తా ఆర్తనాదాలుగా మారి, ఆ లోయంతా విషాద ఛాయలు అలముకున్నాయి.ఈ దుర్ఘటన కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కాదు, యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

అందమైన లోయ రక్తంతో తడిసి ముద్దవడం, శాంతిని కోరుకున్న వారి ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో అంతమవ్వడం అందర్ని కలిచి వేస్తోంది.జమ్మూ కాశ్మీర్ కోసం పాకిస్థాన్ ఉగ్రవాదులు ఇలా దాడులు చేయడం పరిపాటిగా మారింది. అయితే జమ్మూ కాశ్మీర్ ఇండియాలో భాగం కాదనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

Did you know that Jammu and Kashmir is not part of India

స్వాతంత్ర్య వచ్చిన తర్వాత పాకిస్థాన్ మన దేశం నుంచి విడిపోయింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో రెండు దేశాలు కూడా గొడవకు దిగాయి. అయితే ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ పాలకులు ఆ ప్రాంతాన్ని స్వాతంత్ర్యంగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జమ్మూ కాశ్మీర్ ఇండియాలో విలీనం అయింది. జమ్మూ కాశ్మీర్ ఇండియాలో కలవడానికి దారి తీసిన పరిస్థితులను ఓసారి పరిశీలిద్దాం.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వేళ, 560కి పైగా రాచరిక రాష్ట్రాలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ లభించింది. అందరూ భారత్‌లో విలీనమైనా, జమ్మూ కాశ్మీర్ పాలకుడు మహారాజా హరి సింగ్ మాత్రం స్వతంత్రంగా ఉండాలని ఆశించారు. కానీ, చరిత్ర మరో విధంగా తిరగనుంది.

1947 అక్టోబర్‌లో పాకిస్తాన్ మద్దతుతో వచ్చిన సాయుధ తెగల దండయాత్ర కాశ్మీర్‌ను భయానక పరిస్థితుల్లోకి నెట్టింది. శ్రీనగర్‌ను లక్ష్యంగా చేసుకుని వస్తున్న దుండగుల ఆగడాలను ఆపడానికి మహారాజా హరి సింగ్‌కు దిక్కుతోచలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆయన జమ్మూకు పారిపోయారు.

దేశాన్ని కాపాడమని వేడుకుంటూ ఆయన భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మరియు గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బాటన్ ఒకే షరతు విధించారు - భారతదేశంలో విలీనం అయితేనే సైనిక సహాయం అందుతుంది.

వేరే దారి లేక, 1947 అక్టోబర్ 26న మహారాజా హరి సింగ్ 'ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్'పై సంతకం చేశారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా జమ్మూ కాశ్మీర్ అధికారికంగా భారతదేశంలో భాగమైంది. మరుసటి రోజే భారత సైన్యం కాశ్మీర్‌కు చేరుకుని దుండగులను తిప్పికొట్టింది.

అలా భయానక పరిస్థితుల్లో చిక్కుకున్న కాశ్మీర్‌ను కాపాడటానికి మహారాజా హరి సింగ్ తీసుకున్న నిర్ణయం, ఒక చారిత్రాత్మక ఒప్పందానికి దారితీసింది. 'ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్' కేవలం ఒక కాగితంపై సంతకం కాదు, అది ఒక ప్రాంతం యొక్క భవిష్యత్తును, లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చిన చారిత్రక ఘట్టం. అలా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఒక అవిభాజ్య భాగంగా నిలిచిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+