Director: వీడి మామూలు సినిమా డైరెక్టర్ కాదు, బ్యాంకులో నకిలీ బంగారం, రూ. 42 లక్షలు స్వాహా, చిత్తూరు జిల్లా !

బెంగళూరు/ తిరుపతి: సినిమా టెక్నిక్ తో ప్రజలను మాయ చేసే సినిమా డైరెక్టర్లను మనం చాలా మందిని చూస్తుంటాము. తమ తెలివితేటలు, నైపుణ్యంతో ఆకట్టుకుంటున్న గొప్ప గొప్ప సినీ దర్శకులు మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు. సినిమా టెక్నిక్స్ ఉపయోగించి మంచి పేరు తెచ్చుకుని జీవితాంతం సినిమా రంగంలో ఉండాలని చాలా మంది దర్శకులు, టెక్నీషియన్లు కలలు కంటుంటారు. అయితే ఇక్కడ ఒక కిలాడీ డర్శకుడు ప్రజలతో పాటు బ్యాంకు అధికారులను నిలువునా ముంచేశాడు. నకిలి బంగారం బ్యాంకులో కుదువ పెట్టిన కేటుగాడు ఏకంగా రూ. 42 లక్షలు అప్పు తీసుకున్నాడు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టే సమయంలో ప్రతినెల క్రమం తప్పకుండా అసలు, వడ్డీ కట్టాలని బ్యాంకు అధికారులు సూచించారు. అసలు కాదు కదా వడ్డీ కూడా కట్టకుండా బ్యాంకులో తీసుకున్న అప్పుతో మనోడు జల్సా చేశాడు. సంవత్సరం అయినా వడ్డీ చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు సినిమా డైరెక్టర్ కు నోటీసులు జారీ చేశారు. ఎవరు మీరు అనే టైపులో మనోడు బ్యాంకు అధికారులను లెక్క చెయ్యకుండా కాలం గడిపేశాడు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు నగలు వేలం వెయ్యడానికి సిద్దం అయిన బ్యాంకు అధికారులకు నెత్తిన పిడుగు పడినట్లు అయ్యింది. సినిమా డైరెక్టర్ సరికొత్త టెక్నాలజీతో నకిలి బంగారం తాకట్టు పెట్టి ఏకంగా రూ. 42. 91 లక్షలు తీసుకున్నాడని పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది. ప్రజలకే కాదు ఏకంగా బ్యాంకుకే కుచ్చుటోపీ పెట్టిన ఆ సినిమా దర్శకుడు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని ఓ ప్రముఖ పట్టణానికి చెందిన వెళ్లి బెంగళూరులో ఇలా స్కెచ్ వేశాడని ఆరోపణలు ఉన్నాయి.

సినిమా ప్రపంచం

సినిమా ప్రపంచం


సినిమా టెక్నిక్ తో ప్రజలను మాయ చేసే సినిమా డైరెక్టర్లను మనం చాలా మందిని చూస్తుంటాము. తమ తెలివితేటలు, నైపుణ్యంతో ఆకట్టుకుంటున్న దర్శకులు మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు. సినిమా టెక్నిక్స్ ఉపయోగించి మంచి పేరు తెచ్చుకుని జీవితాంతం సినిమా రంగంలో ఉండాలని చాలా మంది దర్శకులు, టెక్నీషియన్లు కలలు కంటుంటారు. అయితే ఇక్కడ ఒక కిలాడీ డర్శకుడు ప్రజలతో పాటు బ్యాంకు అధికారులను నిలువునా ముంచేశాడు.

 పేరులోనే తిరకాసు

పేరులోనే తిరకాసు

భారతదేశంతో పాటు ప్రపంచంలోని భారతీయులకు, కొన్ని విదేశాలలోని సినీ రంగానికి చెందిన వారికి, సినిమా గురించి తెలిసిన వాళ్లకు మణిరత్నం పేరు పెద్దగా పరిచయం చెయ్యనవసరం లేదు. మణిరత్నం అంత పెద్ద డైరెక్టర్ కావాలని అనుకున్నాడో ఏమో ఒక మహానుభావుడు అతని పేరు రవిరత్నంగా మార్చుకుని కన్నడ సినీరంగంలో అడుగు పెట్టాడు.

చిన్నాచితకా సినిమాలు

చిన్నాచితకా సినిమాలు

రవిరత్నం పేరుతో కన్నడలో ఎంట్రీ ఇచ్చిన కరమల బాలరవీంద్రనాథ్ అలియాస్ బాలు అలియాస్ పెయింటర్ బాలు అలియాస్ రవిరత్నం మధుర స్వప్న అనే సినిమాకు దర్శకత్వం వహించారు. 2016లో విడుదలైన మధురస్వప్న సినిమా ఎప్పుడు థియేటర్లలోకి ఎప్పుడు బయటకు వెళ్లిపోయిందో స్యాండిల్ వుడ్ సినీ ప్రేక్షకులకే గుర్తు లేదని అంటున్నారు.

బ్యాంకులో నకిలి బంగారం తాకట్టు

బ్యాంకులో నకిలి బంగారం తాకట్టు

బెంగళూరులోని రాజాజీనగర్ ఏరియాలో నివాసం ఉంటున్న రవిరత్నం అలియాస్ బాలు సినిమా దర్శకుడిగా ముద్రవేసుకున్నాడు. రాజాజీనగర్ లోని ఫెడరల్ బ్యాంకులో 1 కేజీ 50 గ్రాముల బంగారు కుదువ పెట్టుకుని తనకు గోల్డ్ లోన్ ఇవ్వాలని అధికారులకు మనవి చేశాడు. సినిమా డైరెక్టర్ రవివర్మ అలియాస్ బాలుతో పాటు మరో ఇద్దరు బ్యాంకు అధికారులకు మనవి చేశారు.

 అక్షరాలా రూ. 42. 91 లక్షలు స్వాహా

అక్షరాలా రూ. 42. 91 లక్షలు స్వాహా


ఫెడరల్ బ్యాంకులో నకిలి బంగారం కుదవ పెట్టిన రవిరత్నం అలియాస్ బాలు తదితరులు అక్షరాలా రూ. 42. 91 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్నారు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టే సమయంలో ప్రతినెల క్రమం తప్పకుండా అసలు, వడ్డీ కట్టాలని బ్యాంకు అధికారులు సూచించారు. అసలు కాదు కదా వడ్డీ కూడా కట్టకుండా బ్యాంకులో తీసుకున్న అప్పుతో సినిమా డైరెక్టర్ రవిరత్నం అలియాస్ బాలు తదితరులు జల్సా చేశారు.

 నోటీసులకు డోంట్ కేర్

నోటీసులకు డోంట్ కేర్

సంవత్సరం అయినా సినిమా డైరెక్టర్ రవిరత్నం తదితరులు వడ్డీ చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు సినిమా డైరెక్టర్ కు నోటీసులు జారీ చేశారు. ఎవరు మీరు అనే టైపులో మనోడు రవిరత్నం బ్యాంకు అధికారులను లెక్క చెయ్యకుండా కాలం గడిపేశాడు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు నగలు వేలం వెయ్యడానికి సిద్దం అయిన బ్యాంకు అధికారులకు నెత్తిన పిడుగు పడినట్లు అయ్యింది.

సార్..... మీరే కాపాడండి

సార్..... మీరే కాపాడండి


బ్యాంకులో ఉన్న బంగారు నగలు కొనుగోలు చెయ్యడానికి వెళ్లి బంగారు నగలు పరిశీలించడంతో అవి నకిలీ బంగారు నగలు అని వెలుగు చూసింది. లోహంతో తయారు చేసిన నగలకు పైన బంగారు పూత పూశారని వెలుగు చూసింది. సినిమా డైరెక్టర్ రవిరత్నంతో పాటు మరో ఇద్దరి మీద ఫెడరల్ బ్యాకు అధికారి భరత్ రాజాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జల్సాల కోసం బ్యాంకుకు కుచ్చుటోపి

జల్సాల కోసం బ్యాంకుకు కుచ్చుటోపి


కేసు నమోదు చేసిన రాజాజీనగర్ పోలీసులు సినిమా డైరెక్టర్ రవిరత్నం అలియాస్ బాలు అలియాస్ బాలరవీంధ్రనాథ్ తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. సినిమా డైరెక్టర్ రవిరత్నం సరికొత్త టెక్నాలజీతో నకిలి బంగారం తాకట్టు పెట్టి ఏకంగా రూ. 42. 91 లక్షలు తీసుకున్నాడని బ్యాంకు అధికారులుపోలీసులను ఆశ్రయించడం స్యాండిల్ వుడ్ లో కలకలం రేపింది. ప్రజలకే కాదు ఏకంగా బ్యాంకుకే కుచ్చుటోపీ పెట్టిన ఆ సినిమా దర్శకుడు రవిరత్నం అలియాస్ బాలు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని ఓ ప్రముఖ పట్టణానికి చెందిన వాడని, చిన్న చిన్న ఫెక్ల్సీ బోర్డులు, ఆర్టిస్టుగా బోర్డులు రాసుకోవడానికి బెంగళూరు చేరుకున్నాడని, ఇప్పుడు బ్యాంకుకే కుచ్చుటోపీ పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+