Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిరాశాజనక బడ్జెట్; అందరికీ మొండి చెయ్యి; రాహుల్ గాంధీతో పాటు మండిపడిన ప్రతిపక్షాల నేతలు

ఈరోజు పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ను ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ఇందులో సామాన్య మధ్యతరగతి ప్రజలు , యువత, రైతులు లేదా మహిళలకు అందించేది ఏమీ లేదని అన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రయోజనమూ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు . నిర్మలా సీతారామన్ ఈ సంవత్సరం బడ్జెట్‌ను 75 ఏళ్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థను వందేళ్ల భారత దేశ ఆర్థిక వ్యవస్థకు నడిపించే బ్లూప్రింట్ అని పేర్కొన్నారు. ఇది జీరో సమ్ బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అన్నారు.

ఈ బడ్జెట్ లో మధ్యతరగతి, సామాన్య ప్రజలకు మొండి చెయ్యి: రాహుల్ గాంధీ

ట్విట్టర్ వేదికగా కేంద్ర బడ్జెట్ 2022 పై స్పందించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మోడీ గవర్నమెంట్ యొక్క జీరో సమ్ బడ్జెట్ ఇదని పేర్కొన్నారు. వేతన జీవులకు బడ్జెట్లో ప్రయోజనం లేదని, మధ్యతరగతి ప్రజలు , పేదలు,నిరుపేదలకు బడ్జెట్ ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు అని, యువత, రైతులు, ఎంఎస్ఎంఈలకు ఏమీ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో అందరికీ మొండి చెయ్యి చూపారని రాహుల్ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మంచిరోజులను మరింత దూరం చేసిన బడ్జెట్ : శశి థరూర్


ఈ బడ్జెట్ నిరుత్సాహపరిచే బడ్జెట్ అని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిధరూర్. ఈ బడ్జెట్ మంచి రోజులు మరింత దూరం చేసిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మధ్య తరగతికి ఎలాంటి ఉపశనమం లభించలేదని పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ అన్నారు. మనీష్ తివారీ ఒక అడుగు ముందుకు వేసి, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఊహకు అందని, స్ఫూర్తి లేని, అవాస్తవికమైన, అమలు చేయలేని, అబద్ధాలతో కూడుకున్న బడ్జెట్ గా మనీష్ తివారి అభివర్ణించారు

తీవ్ర నిరాశకు గురి చేశారు: కాంగ్రెస్ రణదీప్ సింగ్ సుర్జేవాలా

భారతదేశంలోని జీతభత్యాలు & మధ్యతరగతి ప్రజలు మహమ్మారి, ఆల్ రౌండ్ వేతనాల్లో కోతలు మరియు ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఉపశమనం కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్ష పన్ను చర్యలలో వారిని మళ్లీ తీవ్ర నిరాశకు గురిచేశారు . ఇది భారతదేశ వేతన జీవులకు, మధ్య తరగతికి ద్రోహం, ' అని కాంగ్రెస్ పార్టీ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు.

ఎలాంటి ఉపశమనం లేని బడ్జెట్ : శివసేన ప్రియాంకా చతుర్వేది

శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది సైతం తాజా బడ్జెట్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. లక్ష్యాలను సాధించడానికి రోడ్‌మ్యాప్ లేదని, వ్యక్తులకు పన్ను మినహాయింపు లేదని, సీనియర్ సిటిజన్లకు ఉపశమనం లేదని, పిల్లల విషయంలో విధాన దృష్టి లేదని, పెరుగుతున్న ఖర్చులు నుండి ఉపశమనం కూడా లేదని తాజా బడ్జెట్ పై ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

నిర్లక్ష్య బడ్జెట్ 2022: తృణమూల్ కాంగ్రెస్‌ డెరెక్ ఓ'బ్రియన్

తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన డెరెక్ ఓ'బ్రియన్, ఉన్నత వర్గాల వారే ఈ ప్రభుత్వానికి మంచి స్నేహితులని, మిగిలిన రైతులు, మధ్యతరగతి, రోజువారీ సంపాదకులు, నిరుద్యోగులు గురించి ఎవరూ పట్టించుకోరని, ఇది ప్రధానమంత్రి నిర్లక్ష్య బడ్జెట్ 2022 అని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ బడ్జెట్ తో ఎవరికీ లాభం లేదన్నారు. సత్యదూరం అయిన బడ్జెట్ అని అసహనం వ్యక్తం చేశారు.

Recommended Video

    Budget 2022: ITR Filing To NPS | Income Tax Slabs| Corporate Surcharge | Oneindia Telugu

    నదుల అనుసంధానం విషయంలో విధ్వంసకర మార్గంలో : జైరాం రమేష్

    ఒకవైపు, బడ్జెట్ వాతావరణ చర్య మరియు పర్యావరణాన్ని పరిరక్షించడం గురించి మాట్లాడుతుంది. మరోవైపు, ఇది పర్యావరణ వినాశకరమైన నదుల అనుసంధాన ప్రాజెక్టులను ముందుకు తెస్తుంది. వాక్చాతుర్యం బాగుంది. కానీ చర్యలు చాలా ముఖ్యమైనవని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జైరాం రమేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నదుల అనుసంధానం విషయంలోమోడీ ప్రభుత్వం విధ్వంసకర మార్గంలో ఉంది అని కాంగ్రెస్‌ మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ ట్వీట్‌ చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+