ఏఐ ఎఫెక్ట్: అమెజాన్, ఉబర్ లో భారీగా ఉద్యోగాలు ఊస్ట్..
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. ప్రతి రంగంపై ఏఐ ప్రభావం చూపుతోంది. మానవుడు ఛేదించలేని అనేక సమస్యలకు అత్యంత వేగంగా పరిష్కారాలను చూపిస్తోంది. అయితే ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ లో ఏఐ కారణంగా మరోసారి భారీగా లేఆఫ్స్ జరగనున్నాయి. ఈసారి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ విభాగంలోనే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్ స్పష్టం చేసింది. ఇప్పటికే కొన్ని నెలల క్రితం దాదాపు 16 వేల మందిని తొలగించింది అమెజాన్ సంస్థ. ఇప్పుడు మరోసారి భారీగా లేఆఫ్స్ జరిపేందుకు సిద్ధం అవుతోంది. అయితే ఈ సారి ఏఐ ఎఫెక్ట్ కారణంగా ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తుందన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.
అయితే ఈ తొలగింపు వ్యూహాత్మక ప్రక్రియలో భాగంగానే జరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. రియటర్స్ సంస్థ అందించిన నివేదిక ప్రకారం.. తాజా లేఆఫ్స్ అమెజాన్ కు చెందిన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ విభాగంలో టీమ్స్ గా పనిచేసే ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ఈ సంస్థ నెక్ట్స్ జనరేషన్ ఏఐ సిస్టమ్స్ ను అభివృద్ధి చేస్తోంది. అయితే ఉద్యోగులను తొలగించినా అమెజాన్ సంస్థ మాత్రం ఏఐ ను లాంగ్ టర్మ్ ప్రియారిటీగా మాత్రమే చూస్తోంది. ఈ లేఆఫ్స్ మార్పుల కారణంగా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ విభాగంలోని నాయకత్వంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

అటు ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ ఉబర్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఉబర్ టెక్నాలజీస్ లోని ఉద్యోగులకు ఈ మేరకు లేఆఫ్స్ ప్రకటించింది. సంస్థలోని కస్టమర్ సర్వీస్ డిపార్ట్ మెంట్ లో 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉబర్ సంస్థలోని సేవలను సులభతరం చేయడంతోపాటు.. సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉబర్ సంస్థ స్పష్టం చేసింది. తొలగించిన ఉద్యోగుల స్థానంలో జనరేటివ్ ఏఐ ద్వారా ఏఐ నే స్వయంగా కస్టమర్లతో సంప్రదిస్తుందని సంస్థ పేర్కొంది. రానున్న రోజుల్లో ఏఐ మరిన్ని రంగాలపై ప్రభావం చూపనుంది.












Click it and Unblock the Notifications