శని వక్రి ప్రభావం.. డిసెంబర్ వరకు ఈ రాశులవారికి నరకం!
జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. న్యాయదేవుడు, క్రమశిక్షణకు మారుపేరు, కర్మలకు అధిపతి అయిన శని దేవుడు ఆశుభాలను మాత్రమే కాదు శుభాలను కూడా చేకూర్చే దేవుడు. క్రమశిక్షణతో ఉండేవారికి మంచి ఫలితాలను ఇచ్చే దేవుడు శని దేవుడు.
జూలై 27వ తేదీ నుంచి డిసెంబర్ వరకు తిరోగమనంలో శని
అటువంటి శనిదేవుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. మీనరాశిలోనే జూలై 27వ తేదీ నుంచి డిసెంబర్ వరకు తిరోగమనంలో సంచారం చేస్తాడు. ఈ తిరోగమన సంచారం కొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో కొన్ని రాశులవారు చేయాలనుకున్న పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మిథునరాశి
మిధున రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది . ఈ సమయంలో కెరీర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.మిధునరాశి వారు పని చేసే చోట జాగ్రత్తగా వ్యవహరించాలి. మిథున రాశిలో ఉన్న వారికి అన్ని విధాలా ఇది చెడు చేసే సమయం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి
సింహరాశి జాతకులకు పనులలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులలో ఊహించని జాప్యం జరుగుతుంది. సింహ రాశి వారు ఈ సమయంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యక్తిగత వివాదాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగ మార్పులు, ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తుతాయి.
ధనుస్సురాశి
ధనుస్సు రాశి జాతకులకు శని తిరోగమనం కారణంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశి వారికి ఆర్ధిక ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం . కుటుంబంలో ఉద్రిక్తతలు ఎదురయ్యే అవకాశం ఉంది.
మీన రాశి
మీనరాశి జాతకులకు శని తిరోగమనం కారణంగా కష్టాలు రానున్నాయి. ఈ సమయంలో ఏ పని చేసినా మీనరాశి వారికి కలిసి రాదు. ఆరోగ్యం విషయంలో నష్టం, ఆర్ధిక విషయాల్లో నష్టం వస్తుంది. ఇది మీనరాశి వారికి ప్రతికూల ఫలితాలను ఇచ్చే సమయం.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications