నేడు రెండు అద్భుత యోగాలు: ఈ రాశులవారు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు!
జూలై 24 2026 శుక్రవారం నాడు బుధుడు మిధున రాశిలో సంచారం చేస్తాడు. కుజుడు తన సొంత నక్షత్రమైన మృగశిర నక్షత్రంలోకి మారడంతో లాభ దృష్టి యోగం ఏర్పడుతుంది. ఇదే సమయంలో జూలై 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు అత్యంత ముఖ్యమైన చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది.
నేడు రెండు అద్భుత యోగాలు
చంద్రుడు వృశ్చిక రాశిలో కుజుడు వృశ్చిక రాశి లోని సంచరించడం వల్ల రెండు గ్రహాల మధ్య పరస్పర వీక్షణ ఏర్పడి చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. ఈ యోగాల కారణంగా కొన్ని రాశులవారికి లాభం జరుగుతుంది. మరికొన్ని రాశులవారికి నష్టం ఉంటుంది. నేడు ద్వాదశ రాశులవారి జాతకం ఒకసారి చూద్దాం.

మేషరాశి : మేషరాశి జాతకులకు నేడు బాగుంటుంది. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. పని చేసే చోట అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు కలిసి వస్తాయి. అనవసరమైన పెట్టుబడులకు దూరంగా ఉండటం అవసరం.
వృషభ రాశి: వీరికి నేడు సహనం తో సానుకూలత ఉంటుంది. కుటుంబపరంగా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి.
మిధున రాశి: నేడు మిథునరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. శాంతియుత ఆలోచనలు, నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి నేడు చాలా వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఏ పని చేసినా కలిసి వస్తుంది.
సింహరాశి : సింహరాశి జాతకులు నేడు పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. శుక్ర సంచారం కారణంగా మీ ఆకర్షణ , సృజనాత్మకత పెరుగుతుంది. వ్యాపారాలు చేసే వారికి బాగుంటుంది.
కన్యా రాశి : కన్యారాశి జాతకులకు వృత్తి పరంగా ప్రశంసలు అందుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబంలో వాతావరణం నేడు ఆహ్లాదకరంగా ఉంటుంది.
తులారాశి : తులారాశి జాతకులు నేడు ఆర్ధిక పురోగతిని సాధిస్తారు. నేడు మీకు పనులలో బంధువులు సహాయకారిగా ఉంటారు. ముఖ్యమైన పనులను తులారాశి జాతకులు పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి: చంద్ర మంగళ యోగం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారు ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూల ఫలితాలను చూస్తారు.
ధనుస్సు రాశి : ధనుస్సు రాశి జాతకులకు నేడు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ధనుస్సు రాశి వారు నిజాయితీ, ధార్మిక చింతన కలిగి ఉంటారు.
మకర రాశి : మకర రాశి జాతకులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అప్పుల నుండి మకరరాశి జాతకులకు ఉపశమనం లభిస్తుంది.
కుంభరాశి : కుంభరాశి జాతకుల ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. కుంభరాశి జాతకులు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కుంభరాశి వారు జాగ్రత్త
మీనరాశి : మీనరాశి జాతకులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు చదువులో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పెట్టుబడుల విషయంలో అలోచించి నిర్ణయం తీసుకోవాలి.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications