• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీ ఎమ్మెల్యే సస్పెషన్‌కు మోడీ ఆదేశాలు

|

మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే ఆకాశ్ విజయవర్గీయ మున్సిపల్ అధికారిపై చేసిన దాడిపై ప్రధాన మంత్రి మోడీ చాల తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే...ఇక ఈనేపథ్యంలోనే ఎమ్మెల్యే చర్యలను పార్లమెంట్‌‌‌లోనే తీవ్రంగా ఖండించిన మోడీ ,ఎమ్మెల్యేపై వేటుకు ఆదేశించినట్టు తెలుస్తోంది..ఈనేపథ్యంలోనే నేడు అధికార నివాసంలో పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశమైన పీఎం ఇలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఎమ్మెల్యే ఆకాశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం.

 ఇతరులకు గుణపాఠం కావాలి...మోడీ

ఇతరులకు గుణపాఠం కావాలి...మోడీ

మరోవైపు ఎమ్మెల్యే వ్వవహరించిన తీరు దాడీ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడ మోడీ తీవ్రంగా స్పందించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి..ఎమ్మెల్యే పోయినా పర్వాలేదు... ఇలాటీ సంఘటనలు పునరావృతం కాకుండా ఇతరులకు గుణపాఠం కావాలని మోడి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే దాడిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేకు మధ్యపద్రేశ్ బీజేపీ నాయకత్వం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.. దీంతో ఆయన సమాధానం వచ్చిన తర్వాత పార్టీ చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతుంది..

ఇండోర్ లో మున్సిపల్ అధికారిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి

ఇండోర్ లో మున్సిపల్ అధికారిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి

గత నెల 26న ఇండోర్ మున్సిపాల్ కార్యాలయం వద్ద బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గీయ హంగామా సృష్టించాడు. ఇండోర్ మున్సిపాలిటీ అధికారిపై తిట్లపురాణం ప్రారంభించాడు.ఆవేశంతో విచక్షణ కోల్పోయిన ఎమ్మెల్యే ప్రజలు ,అధికారులు చూస్తుండగానే.. క్రికెట్ బ్యాట్‌తో మున్సిపల్ అధికారిపై దాడి చేసి హిరోయిజం చూపించాడు. ఏం జరిగిందని అక్కడున్న మీడియా ప్రతినిధులు ఆకాశ్‌ను అడగ్గా .. అధికారులు అక్రమంగా ఓ భవనాన్ని కూల్చివేశారని పేర్కొన్నాడు. అయితే భవనంతో కొందరు నివసిస్తున్నారని ఎమ్మెల్యే వాదిస్తున్నారు. ఇదే విషయం అడిగేందుకు ఫోన్ చేస్తే సదరు అధికారి తన కాల్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓటువేసిన ప్రజలకు ప్రతినిధినని .. వారికి సంబంధించి బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు.

జైలు తర్వాత కూడ వెనక్కి తగ్గని ఎమ్మెల్యే...

జైలు తర్వాత కూడ వెనక్కి తగ్గని ఎమ్మెల్యే...

ఇక అధికారిని కొట్టిన అనంతరం ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు పలు విమర్శలను ఎదుర్కోన్నారు. ముందు రిక్వేస్టు, తర్వాత అటాక్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి... దీంతో అకాశ్ వ్యవహార శైలీ సంచలనం రేగింది...అయితే భవనాన్ని కూల్చివేయాలని యాజమాని కార్పొరేషన్ కోరడం కొసమెరపు కాగా... అనంతరం ఆయనపై కేసు నమోదు కావడంతో కోర్టు రిమాండ్‌కు తరలించింది. దీంతో నాలుగు రోజుల పాటు జైలు జీవీతం గడిపిన అకాశ్ విజయవర్గీయ విడుదల అయ్యాడు. ఇక జైలు నుండి విడుదలైన అనంతరం కూడ ఆయన అనుచరులు వీరంగం చేశారు..విడుదల సంధర్భంగా గాల్లోకి కాల్పులు జరపడం... వీధుల్లో స్వీట్లు పంచడం లాంటీ హెయమైన చర్యలకు దిగారు..దీంతో వీరిని కూడ పార్టీ నుండి సస్పెండ్ చేసేందుకు పార్టీ హైకమండ్ సిద్దవుతోంది.

 మోడీ చర్యతో పార్టీనేతలకు చెక్...

మోడీ చర్యతో పార్టీనేతలకు చెక్...

మొత్తం మీద మోడీ తప్పు చేసిన ఎమ్మెల్యే తన పార్టీ వాడైన సానుభూతి చూపకుండా... చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు చేయడంతో భవిష్యత్‌లో ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అధికారం ముసుగులో చేసే వారికి గుణపాఠం అయ్యో అవకాశాలు ఉన్నాయి..దీంతో మోడీ తీసుకుంటున్న నిర్ణయం పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు చేసే అరాచాకాలకు చెక్ పెట్టేందుకు కూడ దోహదం చేయనున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Lawmakers of the ruling BJP will have a session with Prime Minister Narendra Modi that sources say will include a chat on discipline in the middle of a huge controversy over Akash Vijayvargiya, a party legislator who assaulted an official with a cricket bat last week and has been completely unrepentant about his behaviour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more