డిస్కో డ్యాన్స్ : జెయింట్ వీల్ కూలి దుర్మరణం

చెన్నై: సరికొత్త టెక్నాలజీతో ఆకట్టుకునేందుకు అమ్యూజ్ మెంట్ పార్కులు పోటీపడుతుంటాయి. పిల్లలకు ఈ పార్కులు అంటే మహా ఇష్టం. చెన్నై శివార్లలోని కిష్కంధ ఎమ్యూజ్ మెంట్ పార్కులో కొత్తగా డిస్కో జాయింట్ వీల్ ను ఇలాగే ఏర్పాటు చేశారు.

ఈ డిస్కో జాయింట్ వీల్ కుప్పకూలిపోయి ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. ఏడు మందికి తీవ్రగాయాలై నాయి. తీవ్రగాయాలైన వారిని తాంబరం లోని దీపం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

Disco Dancer died near Chennai Crashes

ఇటీవలే ఈ కొత్త డిస్కో జాయింట్ వీల్ ను ఏర్పాటు చేశారని పోలీసులు అంటున్నారు. ఆ జాయింట్ వీల్ ను పరిశీలిస్తున్న సమయంలోనే అది కాస్త కుప్పకూలిందని విచారణలో వెలుగు చూసింది. ఈ విషయంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటనకు బాధ్యులైన పార్కు యజమాని జోష్ పునిష్, పార్క్ మేనేజర్ శాంతివేలంలను అరెస్టు చేసి విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+