బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Diwali: అపార్ట్ మెంట్ లో టపాసుల లొల్లి, తండ్రితో కలిసి మేనేజర్ ను చంపేసిన టెక్కీ, వారం ముందు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మంగళూరు: దీపావళి పండుగ సందర్బంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో టపాసులు (క్రాకర్స్) కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారిని ఎవ్వరూ లెక్కచెయ్యలేదు. కాలుష్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా మూడు రోజులుగా దేశంలోని అనే ప్రాంతాలు టపాసుల శభ్దాలతో దద్దరిల్లింది. టపాసులు కాల్చే విషయంలో అక్కడక్కడ గొడవలు జరిగాయి. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న రెండు కుటంబాల మధ్య టపాసులు కాల్చే విషయంలో గొడవ జరిగింది. ఓ వ్యక్టి ట్రావెల్స్ సంస్థకు చెందిన వాడు. మరో కుటుంబంలో విద్యావంతులు ఉన్నా గొడవ పెద్దగా జరిగింది. ఆ సమయంలో ఇరు వర్గాల మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన రిటైడ్ బ్యాంకు ఉద్యోగి, సాఫ్ట్ వేర్ ఇంజనీరు అయిన అతని కొడుకు కలిసి మరో వ్యక్తిని దారుణంగా పొడిచి చంపేయడం కలకలం రేపింది, టపాసులు కాల్చే విషయంలో గొడవ జరిగి ఒకరు హత్యకు గురి కావడం కలకలం రేపింది. హత్యకు గురైన వ్యక్తి, హత్య చేసిన వ్యక్తుల కుటంబాల మధ్య వారం క్రితం చిన్న విసయంలో గొడవ జరిగింది.

Illegal affair: ఎస్ఐ భార్యకు ఇద్దరు ప్రియులు, బ్లాక్ మెయిల్ ?, స్పాట్ పెట్టి లేపేసిన ఎస్ఐ !Illegal affair: ఎస్ఐ భార్యకు ఇద్దరు ప్రియులు, బ్లాక్ మెయిల్ ?, స్పాట్ పెట్టి లేపేసిన ఎస్ఐ !

 దిపావళి ఢమాకా

దిపావళి ఢమాకా

దీపావళి పండుగ సందర్బంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో టపాసులు (క్రాకర్స్) కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారిని ఎవ్వరూ లెక్కచెయ్యలేదు. కాలుష్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా మూడు రోజులుగా దేశంలోని అనే ప్రాంతాలు టపాసుల శభ్దాలతో దద్దరిల్లింది. దీపావళి పండుగ సంతోషంగా చేసుకుంటే సంవత్సరం పొడవునా హ్యాపీగా ఉంటామని కొందరి నమ్మకం.

 ఒకే అపార్ట్ మెంట్ లో నివాసం

ఒకే అపార్ట్ మెంట్ లో నివాసం

కర్ణాటకలోని మంగళూరులోని కార్ స్ట్రీట్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర అపార్ట్ మెంట్ లో రిటైడ్ బ్యాంకు ఉద్యోగి క్రిష్ణానంద కిణి (78) అనే ఆయన నివాసం ఉంటున్నారు. క్రిష్ణానంద కుమారుడు అవినాష్ (42) సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే అపార్ట్ మెంట్ లోని మరో ఫ్లాట్ లో ట్రావెల్స్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న వినాయక్ కామత్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

 రాత్రి 11 గంటలకు జోరుగా టపాసులు కాల్చారు

రాత్రి 11 గంటలకు జోరుగా టపాసులు కాల్చారు

రాత్రి 11 గంటల సమయంలో అపార్ట్ మెంట్ ఆవరణంలో కొందరు టపాసులు కాల్చుతున్నారు. పెద్దఎత్తున టపాసులు కాల్చుతున్న సమయంలో వినాయక్ అక్కడికి వెళ్లాడు. అప్పటికే రిటైడ్ బ్యాంకు ఉద్యోగి క్రిష్ణానంద అక్కడ ఉన్నాడు. ఇంతరాత్రిలో టపాసులు కాల్చితే మేము ఎలా నిద్రపోవాలని, దయచేసి టపాసులు కాల్చకూడదని వినాకయ్ అక్కడ టపాసులు కాల్చుతున్న వారికి చెప్పాడు.

 నేను ఉన్నాను.... మీరు కాల్చండి

నేను ఉన్నాను.... మీరు కాల్చండి

ఆసమయంలో నేను ఇక్కడే ఉన్నానని, మీరు ధైర్యంగా టపాసులు కాల్చాలని, ఎవరు అడ్డు వస్తారో నేను చూస్తానని క్రిష్ణానంద అక్కడ టపాసుల కాల్చుతున్న వారిని మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో క్రిష్ణానంద, వినాయక్ మద్య మద్య మాటామాటా పెరిగిపోయింది. ఇరు వర్గాల మద్య గొడవ పెద్దది అయ్యింది.

తండ్రి, కొడుకు కలిసి కత్తులతో పొడిచి చేంపేశారు

తండ్రి, కొడుకు కలిసి కత్తులతో పొడిచి చేంపేశారు

ఆ సమయంలో ఇంట్లో ఉన్న క్రిష్ణానంద కుమారుడు అవినాష్ కు విషయం తెలిసి ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని అపార్ట్ మెంట్ గేట్ సమీపంలోకి వెళ్లాడు. తరువాత మళ్లీ గొడవ ఎక్కువ కావడంతో సహనం కోల్పోయిన రిటైడ్ బ్యాంకు ఉద్యోగి క్రిష్ణానంద, అతని కుమారుడు సాఫ్ట్ వేర్ ఇంజనీరు అవినాష్ కలిసి కత్తులతో వినాయక్ ను పొడిచి దారుణంగా చంపేయడం కలకలం రేపింది,

 వారం ముందు చిన్న విషయంలో గొడవ

వారం ముందు చిన్న విషయంలో గొడవ

హత్యకు గురైన వినాయక్ కు, హత్య చేసిన క్రిష్ణానంద, ఆయన కొడుకు అవినాష్ కుటంబాల మధ్య వారం క్రితం చిన్న విసయంలో గొడవ జరిగింది. అపార్ట్ మెంట్ ముందు కాంక్రీట్ వేసే విషయంలో కారులో వెళ్లిన వినాయక్ ను క్రిష్ణానంద అడ్డుకున్నాడని, రెండు రోజులు కారు బయటకు తియ్యకుడాదని పెద్ద గొడవ చేశారని, అప్పటి నుంచి రెండు కుంటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

English summary
Diwali: Man murder for quarrel for in the name of fireworks in Mangaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X