ఆసుపత్రిలో విస్తుపోయే సంఘటన, అల్లాడిన పేషెంట్లు
ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విస్తుపోయే సంఘటన చోటు చేసుకుంది. గట్టిగా మ్యూజిక్ పెట్టడంతో పేషెంట్లు అల్లాడిపోయారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విస్తుపోయే సంఘటన చోటు చేసుకుంది. గట్టిగా మ్యూజిక్ పెట్టడంతో పేషెంట్లు అల్లాడిపోయారు.
అక్కడ పని చేస్తున్న సిబ్బందే ఇలా చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో డిజె పార్టీ నిర్వహించారు. ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ వార్డుబాయ్ కుమారుడి పుట్టిన రోజును అక్కడి వైద్యులు, సిబ్బంది ఘనంగా నిర్వహించాలనుకున్నారు.

ఇందుకోసం హాస్పిటల్‌కే కేక్ తెప్పించారు. పేషెంట్లను పట్టించుకోకుండా పెద్దగా పాటలు పెట్టి డ్యాన్సులు చేశారు. దీంతో నిద్రపట్టక పేషెంట్లు అల్లాడిపోయారు.
ఈ దృశ్యాన్ని స్థానిక మీడియా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.












Click it and Unblock the Notifications