మోడీ దెబ్బ: ఐటీ శాఖ విచారణ, మంత్రి డీకే శివకుమార్ ఏం చెప్పారంటే ?

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఆదాయపన్ను శాఖ దాడిలో తన ఇంటిలో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాల వివరాలు చెప్పడానికి కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ సంబంధిత అధికారులు ముందు సోమవారం విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. విచారణ పూర్తి అయిన తరువాత ఐటీ శాఖ కార్యాలయం ముందు డీకే. శివకుమార్ మీడియాతో మాట్లాడారు.

ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం విచారణకు హాజరుకావాలని సూచించారని, అందుకే వచ్చానని మంత్రి డీకే. శివకుమార్ చెప్పారు. గతంలోను ఆదాయపన్ను శాఖ అధికారుల ముందు హాజరైయ్యానని ఇదే సందర్బంలో గుర్తు చేశారు.

ఆదాయపన్ను శాఖ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని డికే. శివకుమార్ వివరించారు. తనను ఆదాయపన్ను శాఖ అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. పంచనామా కోసం ఆదాయపన్ను శాఖ అధికారులకు తమ ఆడిటర్లు అర్జీ సమర్పిస్తారని డీకే శివకుమార్ అన్నారు.

ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణకు ఎప్పుడు పిలిచినా తాను హాజరు అవుతానని డీకే. శివకుమార్ అన్నారు. తనను మంగళవారం మళ్లీ విచారణకు హాజరుకావాలని అధికారులు చెప్పలేదని ఓ ప్రశ్నకు డీకే. శివకుమార్ సమాధానం ఇచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka Minister DK Shivakumar leaves IT Dept office in Bengaluru after being questioned for almost 3 hours. connection with the recent raids on his properties in Bengaluru and New Delhi last week. The minister was summoned to the questioning under Section 131 of the Income Tax Act.
Please Wait while comments are loading...