సీఎం కొడుక్కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన డీకే, ఆయన గొప్ప లీడర్, మా సపోర్టు ఉంటుంది !
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడిగా నేను కలిసి లోక్ సభ ఎన్నికలు ఎదుర్కొంటామని, సిద్దరామయ్య నేతృత్వంలోనే తాము లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుకుంటామని, ఇందులో ఎలాంటి సందేహం లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిస్తే సిద్ధరామయ్య ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారని సీఎం కుమారుడు యతీంద్ర ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర ప్రకటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ యతీంద్ర బాధ్యతాయుతమైన నాయకుడు అన్నారు. తమకు బలం ఇవ్వాలని ప్రజలను కోరడం సహజం, యతీంద్ర మాటలను వక్రీకరించాల్సిన అవసరం లేదని, ప్రజల నుంచి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరుకోవడం, ప్రజలను ఆలా అడగడం తప్పు కాదని డీకే శివకుమార్ అన్నారు.

నా ప్రాంతంలో నేను కూడా చాలా బలమైన నాయకుడు అని, అయితే ఆ ప్రాంతంలో ప్రజల మద్దతు కావాలని కోరడంలో ఎలాంటి తప్పు లేదని, సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర కూడా అలాగే కాంగ్రెస్ కు ప్రజల మద్దతు కావాలని కోరాడని డీకే శివకుమార్ చెప్పారు. యతీంద్ర మాటలను వక్రీకరించాల్సిన అవసరం లేదని, యతీంద్ర చాలా బాధ్యతాయుతమైన నాయకుడని, ఆయన్ను తాము ప్రోత్సహిస్తామని డీకే శివకుమార్ చెప్పారు.

డీకే శివకుమార్‌కు అధికారం దక్కకుండా ఆయన అధికారాన్ని సిద్దరామయ్య అనుభవిస్తారనే లాగా యతీంద్ర మాట్లాడారని డీకే శివకుమార్ అనుచరులు అసహనం వ్యక్తం చేశారు. డీకే శివకుమార్ అధికారాన్ని కూడా సిద్దరామయ్య అనుభవించడానికి సిద్దం అయ్యారని బీజేపీ విమర్శించడంపై మీడియా ప్రశ్నించగా ముందు బీజేపీ నాయకులు వాళ్ల సొంత పార్టీ గురించి ఆలోచించుకుంటే మంచిదని డీకే శివకుమార్ బీజేపీ మీద ఎదురుదాడి చేశారు.

నకిలీ మైసూర్ శ్యాండిల్ సబ్బుల తయారీదారులతో బీజేపీ నేతలకు లింక్ ఉందనే ఆరోపణల విషయంలో మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ సమాధానమిచ్చారు. మైసూర్ శ్యాండిల్ నకిలి సబ్బులను తాను చూశానని, అసలైన మైసూర్ శ్యాండిల్ సబ్బులు, నకిలీ మైసూర్ శ్యాండిల్ సబ్బులు అచ్చం ఒకేలాగా ఉన్నాయని, అయితే నకిలి సబ్బులు ఒక రోజు తర్వాత రంగు మారుతున్నాయని, దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని ముందే చెప్పానని, మైసూరు శ్యాండిల్ నకిలి సబ్బులు తయారు చేస్తున్న వాి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీకే శివకుమార్ హెచ్చరించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications