తమిళనాడుకు నీరు వదలడం సాధ్యం కాదు, తేల్చి చెప్పిన డీకే, స్టాలిన్ ఏం చేస్తారు ?

బెంగళూరు: కావేరీ నీటిని విడుదల చేయాలని పై నుంచి ఆదేశాలు రావడంతో కర్ణాటకలో ఆందోళన నెలకొంది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. తమిళనాడుకు ప్రతిరోజూ 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మెనేజ్ మెంట్ బోర్డు తెలిపింది. కానీ మాదగ్గర నీళ్లు లేవని డీకే శివకుమార్ చెప్పారు.

కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు నీటి విడుదలపై బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన డీకే శివకుమార్ బుధవారం లేదా గురువారాల్లో కావేరీ ఇరిగేషన్‌ అథారిటీ సమావేశం జరిగే అవకాశం ఉందని, అక్కడ తమ వైఖరిని స్పష్టం చేస్తామని డీకే శివకుమార్ చెప్పారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, నేను చర్చించి నీటిని విడుదల చేయడం సబబు కాదని నిర్ణయించామని డీకే శివకుమార్ వివరించారు.

DK Shivakumar said that it is not possible to release Cauvery water to Tamil Nadu.

తమిళనాడు రాష్ట్రం 12 వేల క్యూసెక్కుల కావేరీ నీరు కావాలని డిమాండ్ చేసింది. 5 వేల క్యూసెక్కులకు తగ్గించారు. ముందుగా తాగునీటికి ప్రాధాన్యత ఇస్తాం, ఆ తర్వాత రైతులకు నీళ్లివ్వడంపై ఆలోచిస్తాం. బెంగళూరులో వర్షం కురిసినప్పుడు ఆశాజనకంగా ఉండేదని, ఇప్పుడు వర్షం పడక ఇబ్బంది పడుతున్నామని డీకే శివకుమార్ వివరించారు.

కావేరి నీటి విడుదల వియంలో మేము జోక్యం చేసుకోబోమని రెండు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు చెప్పిందని, కానీ మేము అఫిడవిట్ సమర్పించామని, అందరికీ వాస్తవాలు చెప్పామని, ఢిల్లీలోని మా న్యాయ నిపుణులతో మాట్లాడతామని, మేము దొంగతనంగా ఏమీ కావేరీ నీరు వాడుకోవడం లేదని డీకే శివకుమార్ అన్నారు, తమిళనాడు అధికారులను కర్ణాటకలో రాష్ట్రంలో పర్యటించి మన పరిస్థితి చూడమని చెబుతామని డీకే శివకుమార్ అన్నారు.

DK Shivakumar said that it is not possible to release Cauvery water to Tamil Nadu.

కావేరీ జలాల పంపిణి సమస్యను రాజకీయం చేస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని అన్నారు. కర్ణాటకలోని ప్రతిపక్ష పార్టీ గురించి పెద్దగా మాట్లాడనని, ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నానని, ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నాం అని డీకే శికవుమార్ అన్నారు. తమిళనాడుకు నీరు విడుదల చేయబోమని గతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ చెప్పినప్పుడు మేము బీజేపీ ప్రభుత్వానికి అండగా నిలిచామని డీకే శివకుమార్ చెప్పారు. ఈ పిటిషన్‌పై వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+