కొడుకును సీఎం చేస్తారా ?, దత్తపుత్రుడిని సీఎం చేస్తారో మీరే తేల్చుకోండి, డీకే డెడ్ లైన్ !

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక సీఎం ఎవరు ? అనే పంచాయితీకి ఈరోజు తెరపడే అవకాశం ఉందని తెలిసింది. ఢిల్లీలో మకాం వేసిన మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు ఎవరి వాదనలు వారు వినిపించారు. తెర మీదకు సొంత కొడుకు, దత్తపుత్రుడు నినాదం రావడంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తలలు పట్టుకుందని తెలిసింది.

సిద్దరామయ్య వాదనలు ఇవే:

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తానే సీఎం కావాలని కోరుకుంటున్నారు, ఆ విషయాన్ని ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు చెప్పారు, అందు వలన తనను సీఎం చెయ్యాలని సిద్దరామయ్య అంటున్నారు. 2013 నుంచి 2018 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు ఉత్తమ సేవలు అందించాను, ఆ విషయం మీకు తెలుసు అని సిద్దరామయ్య అంటున్నారు.

DK Sivakumar has given a deadline to decide

దళితులు, వెనుకబడిన వర్గాలు (బీసీలు) కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా వారితో నిత్యం టచ్ లో ఉండి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేలాచేశాను, కర్ణాటక మొత్తం తిరిగి ఎన్నికల ప్రచారం చేశాను. 135 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో తన పాత్ర ఎక్కువగా ఉందని, ఇక ముందు తాను ఎన్నికల్లో పోటీ చెయ్యను కాబట్టి తననే సీఎం చెయ్యాలని మల్లికార్జున ఖార్గేకి మాజీ సీఎం సిద్దరామయ్య మనవి చేశారు.

డీకే. శివకుమార్ వాదనలు:

తాను కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోక ముందు కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి ?, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి ?, కేపీసీసీ అధ్యక్షుడిగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి భారీ మెజారిటీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు బహుమతిగా ఇచ్చానని, తిండితిప్పలు, నిద్రహారాలు మానేసి పార్టీ కోసం కష్టపడిన తనను సీఎం చెయ్యాలని డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్ కు మనవి చేశారు.

మీకు మీ ఇంటి కొడుకు కావాలా ?, దత్తపుత్రుడు కావాల అని మీరే డిసైడ్ చేసుకోవాలని డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్ కు తేల్చి చెప్పారని తెలిసింది. సొంత కొడుకును సీఎం చెయ్యండి, దత్తపుత్రుడు (జేడీఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన సిద్దరామయ్య)ను సీఎం చెయ్యకూడదని, ఇంతకు ముందే ఆయన్ను సీఎం చేశారని డీకే శివకుమార్ అంటున్నారు.

మొదట కన్నకొడుక్కి ప్రధాన్యత ఇవ్వాలని, కొడుక్కి న్యాయం చెయ్యాలని డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి మనవి చేశారు. సిద్దరామయ్య ఇప్పటికే ఓసారి మఖ్యమంత్రిగా పని చేశారు. అసెంబ్లీలో సీఎల్ పీ నాయకుడిగా పని చేశారని. కాంగ్రెస్ పార్టీలో ఆయన అన్ని పదవులు అనుభవించారని డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు చెప్పారు.

మీరు ఏం చెబితే ఆపనులు మొత్తం తాను చేశాను, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం తాను అన్ని త్యాగం చేశానని, బీజేపీ ప్రతికార చర్యలకు తాను జైలుకు కూడా వెళ్లానని, అందుకే తనకు ఇప్పుడు సీఎం పదవి ఇచ్చి న్యాయం చెయ్యాలని డీకే శికుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు మనవి చేశారు. మొత్తం మీద సెంటిమెంట్ తో కొడుతున్న డీకే శివకుమార్ ను సీఎం చేస్తారా ?, కాంగ్రెస్ హైకమాండ్ సిద్దరామయ్యకు మరోసారి అవకాశం ఇస్తుందా అనే విషయం వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+