బెంగళూరు పేలుడు కేసుకు, కుక్కర్ బాంబు పేలుడుకు లింక్ ?, సీఎం క్లారిటీ, డీకే మాత్రం ఇలా !

మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు పేలుడు ఘటనతో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడుకు లింకు ఉందని తెలుస్తోంది. మంగళూరులో, బెంగళూరులో జరిగిన పేలుళ్లకు ఉపయోగించే పేలుడు పదార్థాలు ఒకేలా ఉంటాయని, అందుకే మంగళూరు, శివమొగ్గ పోలీసులు కూడా బెంగళూరు వచ్చి తనిఖీలు చేస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.

అయితే రామేశ్వరం కేఫ్ పేలుడుతో బెంగళూరు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. బెంగళూరులోని సదాశివనగర్ లోని నివాసం సమీపంలో శనివారం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. శుక్రవారం బెంగళూరులోని కుందనహళ్లిలోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడు కేసును మా ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది, ఈ దుర్ఘటనకు బాధ్యులు ఎవరైనప్పటికీ వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.

DK Sivakumar said that there is a connection between the Mangalore blast and the Bangalore blast

రామేశ్వరం కేసు దర్యాప్తుకు 8 ప్రత్యేక బృందాలను నియమించామని, బెంగళూరులోని సీసీటీవీలను పరిశీలిస్తున్నారని, నేరస్థుడు ఎలా వచ్చాడు, ఎలాంటి పేలుడు పదార్థాలను ఎలా విడిచిపెట్టాడు అనే వీడియో దర్యాప్తు చేస్తున్న అధికారులకు లభించిందని, అతని రూపాన్ని గురించి ఒక నిర్దారణకు వచ్చిందని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. ఈ కేసు విచారణకు సంబంధించిన సమాచారం ఇప్పుడే బయటకు చెప్పడం సాధ్యం కాదని డీకే శివకుమార్ అన్నారు.

రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తు చేసేందుకు పోలీసు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఈ కేసులో సమర్ధవంతమైన విచారణ జరుగుతోందని, ఈ కేసు విషయంలో బీజేపీ నేతలు ఎలాంటి విమర్శలు చేసినా మేం పట్టించుకోమని, రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టుకోవడం మా ప్రథమ ప్రాధాన్యత అని, ఈ విషయంలో బీజేపీ నాయకులు మా ప్రభుత్వానికి సహకరించినా ఫర్వాలేదు, లేదా రాజకీయాలు చేసినా ఓకే అని డీకే శివకుమార్ కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పారు.

ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలించి దర్యాప్తు చేస్తామని, అందులో ఎలాంటి అనుమానం వద్దని మాత్రమే తాను చెబుతామని డీకే శివకుమార్ అన్నారు. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుకు సంబంధించి దర్యాప్తుకు తాము సహకరిస్తాం కానీ కేసును మూటగట్టుకోకూడదని బీజేపీ నేత చేసిన ప్రకటనపై మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ స్పందించారు.

బీజేపీ నాయకులు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో మేము చూస్తున్నామని, వారి సహకారం మాకు అక్కర్లేదని, బెంగుళూరు పేరు చెడగొట్టేందుకు వాళ్లు ఏం చేస్తున్నారో మాకు తెలుసు అని డీకే శివకుమార్ అన్నారు. రామేశ్వరం కేఫ్ పేలుళ్లకు ఇంటెలిజెన్స్ విభాగం వైఫల్యమా అని మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ సమాధానం ఇస్తూ బీజేపీ హయాంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, పార్లమెంట్‌లో ఏం జరిగిందో అందరం చూశామని అన్నారు.

DK Sivakumar said that there is a connection between the Mangalore blast and the Bangalore blast

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు గతంలో మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు పేలుడు లాంటిది కాదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మంగళూరులో కుక్కర్‌ బాంబు పేలుడు రిగిందని, అయితే బెంగళూరులో ఎలాంటి కుక్కర్‌లోనూ పేలుడు జరగలేదని, ఈ కేసు విచారణ కొనసాగుతోందని, అయితే ఇప్పుడే ఈ కేసు దర్యాప్తు వివరాలు బయటకు చెప్పడం సాధ్యం కాదని సీఎం సిద్దరామయ్య తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+