డీకే స్కెచ్ అదుర్స్, మాజీ సీఎం బద్ద శత్రువు కూతురితో చర్చలు, అదే జరిగితే రచ్చరచ్చ !
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలుచోటుచేసుకుంటున్నాయి. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి సింగపూర్ వెళ్లారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పటికే ఆరోపించారు. కర్ణాటకలో ఇప్పుడు సింగపూర్ రాజకీయాలు హాట్ టాపిక్ అయ్యాయి.
ఈ పరిణామం మధ్య కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సీపీ. యోగేశ్వర్ కుమార్తె నిశా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ ను కలిశారు. డీసీఎం డీకే శివకుమార్ మాతె మాజీ మంత్రి సీపీ యోగేశ్వర్ కుమార్తె చర్చలు జరపడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. రోజురోజుకు కార్ణాటక రాజకీయాలు వెడిఎక్కడంతో ఇప్పుడు రామనగర్ రాజకీయాల్లో కలకలం రేగింది.

మాజీ సీఎం : కుమారస్వామి సింగపూర్ పర్యటనకు సంబంధించిన సమాచారం నా వద్ద ఉంది. బెంగళూరులో గేమ్ ప్లాన్ సిద్ధం కాలేదని ఇప్పుడు సింగపూర్ లో మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని, దీని గురించి మాకు అన్నీ తెలుసని డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్‌డీ కుమారస్వామికి బద్ధ శత్రువుగా పేరున్న బీజేపీ ఎమ్మెల్సీ సీపీ. యోగేశ్వర్ ఎన్నికల ముందు నుంచే డీకే పావులు కదుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

గతంలో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో మాజీ మంత్రి సీపీ. యోగేశ్వర్ పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో యోగేశ్వర్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని డీకే శివకుమార్, డీకే. సురేష్ సోదరులు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సీపీ. యోగేశ్వర్ కాంగ్రెస్‌లో చేరితే రామనగర్, మాండ్యలో కాంగ్రెస్ మరింత బలం పుంజుకుంటుందని డీకే శివకుమార్ ఆలోచిస్తున్నారు.













Click it and Unblock the Notifications