బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

DKS: ఈడీ ముందు హాజరైన డీకేఎస్, ఇలాంటి టైమ్ లో మాకు వేధింపులు, పర్వాలేదు !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ట్రుబుల్ షూటర్, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ న్యూఢిల్లీలో ఈడీ అధికారులు ముందు విచారణకు హాజరైనారు. ఈడీ అధికారులు నోటీసులు జారీ చెయ్యడంతో శుక్రవారం డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లి ఈడీ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. డీకే. శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ కు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు కచ్చితంగా మీరు ఢిల్లీలోని కార్యాయానికి వచ్చి విచారణ ఎదుర్కొవాలని సూచించడంతో డీకే బ్రదర్స్ ఈడీ కార్యాలయంలో హాజరైనారు.

Crime: ఉద్యోగం చేస్తున్న భార్య మీద డౌట్, పెళ్లామ్ ను ఏం చెయ్యలేక 8 ఏళ్ల కూతురి మీద పగ !Crime: ఉద్యోగం చేస్తున్న భార్య మీద డౌట్, పెళ్లామ్ ను ఏం చెయ్యలేక 8 ఏళ్ల కూతురి మీద పగ !

 యువరాజు కోసం

యువరాజు కోసం

రాహుల్ గాంధీ చేపట్టిన కన్యాకుమారి టూ కాశ్మీర్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్ర సక్సస్ చెయ్యాలని కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ అన్నీతానై చూసుకుంటున్నారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్రను విజయవంతం చెయ్యాలని సోనియా గాంధీ ఆ బాధ్యతలను డీకే. శివకుమార్, డీకే. సురేష్ సోదరులు అప్పగించారని తెలిసింది.

 నో చెప్పిన ఈడీ అధికారులు

నో చెప్పిన ఈడీ అధికారులు

పీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి, ట్రుబుల్ షూటర్ డీకే శివకుమార్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డీకే. శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ కు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు ఈెనె 7వ తేదీన శుక్రవారం ఢిల్లీలోని కార్యాయానికి వచ్చి విచారణ ఎదుర్కొవాలని సూచించారు. విచారణకు హాజరుకావడానికి సమయం కావాలని డీకే శివకుమార్ సోదరులు మనవి చేసినా ఈడీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు.

 ఈడీ ముందు హాజరైన డీకే బ్రదర్స్

ఈడీ ముందు హాజరైన డీకే బ్రదర్స్

శుక్రవారం ఢిల్లీ చేరుకున్న డీకే. శికుమార్ ఏపీజే అబ్దుల్ కలామ్ రోడ్డులోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైనారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు డీకే. శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ కార్యాలయంలో మమ్మల్ని విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చి రాజకీయ కక్ష సాధింపులు సాగిస్తున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు.

 న్యాయం జరుగుతోందని నమ్మకం ఉంది

న్యాయం జరుగుతోందని నమ్మకం ఉంది

విచారణకు హాజరుకావడానికి మాకు సమయం ఇవ్వాలని మనవి చేసినా ఈడీ అధికారులు పట్టించుకోవడం లేదని కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన యంగ్ ఇండియన్ సంస్థకు డీకే. శివకుమార్, ఆయన సోదరుడు డీకే, సురేష్ అక్రమంగా నగదు బదిలి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

 సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంతు అయిపోయింది

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంతు అయిపోయింది

నేషనల్ హెరాల్డ్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, పవన్ బన్సాల్ ను ఈడీ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఇదే కేసులో ఇప్పుడు కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ డీకే. సురేష్ ను ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.

English summary
DKS: National Herald case, KPCC president DK Shivakumar appears before ED in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X