ఆసుపత్రిలో చేరిన క్యాప్టెన్ విజయ్ కాంత్: మళ్లీ ఏమైంది!
చెన్నై: డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ అనారోగ్యంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. గురువారం ఉదయం చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో విజయ్ కాంత్ చికిత్స కోసం చేరారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
గురువారం స్వల్ప అస్వస్థతకు గురైన విజయ్ కాంత్ ను వెంటనే ఆయన సతీమణి ప్రేమలత విజయ్ కాంత్ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్రస్తుతం విజయ్ కాంత్ కు మెరుగైన వైద్యపరీక్షలు చేస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

విషయం తెలుసుకున్న డీఎండీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి దగ్గరకు పరుగు తీశారు. అయితే విజయ్ కాంత్ ను చూడటానికి వైద్యులు అనుమతించలేదని సమాచారం. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, మామూలుగా నిర్వహించే వైద్య పరీక్షలు చేస్తున్నారని డీఎంకే నాయకులు చెబుతున్నారు.
డీఎండీకే పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందనవసరం లేదని విజయ్ కాంత్ సన్నిహితులు అంటున్నారు. అనారోగ్యంతో గత కొంత కాలం క్రితం ఆసుపత్రిలో చేరిన విజయ్ కాంత్ ఇటీవలే ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. మళ్లీ ఆయన ఆసుపత్రిలో చేరారని తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications