కరుణానిధికి అస్వస్థత: మళ్లీ ఆసుపత్రికి!, ప్రెస్ నోట్‌లో ఏం చెప్పారంటే!
చెన్నై: డీఎంకె అధినేత కరుణానిధి ఆరోగ్యం మరోసారి క్షీణించినట్లుగా తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా అనారోగ్యానికి గురికావడంతో.. కుటుంబ సభ్యుల్లోను, పార్టీ వర్గాల్లోను ఆందోళన మొదలైంది.
శ్వాస కోశ సమస్య వల్లే ఆయన ఆసుపత్రిలో చేరాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన శరీరంలో అమర్చిన కృత్రిమ అన్న వాహిక(ఫుడ్ పైప్)ను మార్చేందుకే ఆసుపత్రిలో చేర్పించారని కావేరీ ఆసుపత్రి వర్గాలు ప్రెస్ నోట్ విడుదల చేశాయి.

ఆసుపత్రికి తరలించిన గంటలోనే తిరిగి ఆయన ఇంటికి కూడా చేరినట్లు అందులో వెల్లడించారు. కాగా గతేడాది డిసెంబర్ లో కరుణానిధి శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల తలెత్తడంతో అప్పట్లో ఆయన కావేరీ ఆసుపత్రిలోనే చికిత్స పొందారు.












Click it and Unblock the Notifications