డీఎంకేతో చేతులు కలుపుతా: సినిమా చూపిస్తా, కేంద్ర ప్రభుత్వం, టీటీవీ దినకరన్!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసి ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీటీవీ దినకరన్ డీఎంకే పార్టీతో చేతులు కపాలని నిర్ణయం తీసుకున్నారు. డీఎంకే పార్టీ వ్యతిరేకిస్తున్న అన్ని విషయాలకు టీటీవీ దినకరన్ మద్దతు ఇస్తున్నారు.

జనవరి 8

జనవరి 8

జనవరి 8వ తేదీ నుంచి తమిళనాడు శాసన సభ సమావేశాలు జరగనున్నాయి. శాసన సభ సమావేశాల్లో డీఎంకే పార్టీతో కలిసి తమిళనాడు ప్రభుత్వ పనితీరును ఎండగడుతానని టీటీవీ దినకరన్ చెప్పారు. మంగళవారం కుంబకోణంలో టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడారు.

కేంద్రంపై విమర్శలు

కేంద్రంపై విమర్శలు

తమిళనాడు ప్రజలు వ్యతిరేకిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా కతిరమంగళం, నెడువాసల్ లో ప్రాజెక్టులు నిర్మిస్తోందని టీటీవీ దినకరన్ ఆరోపించారు. తమిళనాడు ప్రజల గౌరవాన్ని తుంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నా ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం చోద్యం చూస్తోందని టీటీవీ దినకరన్ విమర్శించారు.

డీఎంకే ఆందోళన

డీఎంకే ఆందోళన

తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ మంగళవారం తంజావూరులో పర్యటించారు. తంజావూర్ లో అధికారులతో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బేటీ అయ్యారు. తమిళనాడులో ప్రజాప్రభుత్వం ఉన్నా గవర్నర్ అధికారులతో సమావేశం కావడానికి వ్యతిరేకిస్తూ డీఎంకే ఆందోళన చేసింది.

గవర్నర్ గో బ్యాక్

గవర్నర్ గో బ్యాక్

డీఎంకే పార్టీ కార్యకర్తలు నల్ల జెండాలు చేత పట్టుకుని గవర్నర్ గో బ్యాక్ అంటూ రోడ్లకు ఇరువైపులు నిలబడి పెద్దఎత్తున నినాదాలు చేశారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు డీఎంకే పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ సందర్బంలోనే టీటీవీ దినకరన్ డీఎంకే కార్యకర్తలకు మద్దతు ఇచ్చారు.

చేతకాని ప్రభుత్వం ఉంటే !

చేతకాని ప్రభుత్వం ఉంటే !

గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ తీరుపై టీటీవీ దినకరన్ మండిపడ్డారు. రాష్ట్రంలో చేతకాని ప్రభుత్వం ఉంటే గవర్నర్లు ఇలాగే వ్యవహరిస్తారని టీటీవీ దినకరన్ ఆరోపించారు. అధికారులతో సమావేశాలను గవర్నర్ వెంటనే నిలిపివేయాలని టీటీవీ దినకరన్ డిమాండ్ చేశారు. తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయించాలని ప్రయత్నిస్తోందని ఆరోనించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amid an allegation by the ruling AIADMK that its rebel leader TTV Dhinakaran had joined hands with DMK working president M K Stalin.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి