అళగిరిని కలిస్తే..: డిఎంకె హెచ్చరిక, ఓడుతుందని వ్యాఖ్య
చెన్నై: కరుణానిధి నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) పార్టీ క్యాడర్‌కు హెచ్చరికలు జారీ చేసింది. సస్పెండైన ఎంకె అళగిరితో సంబంధాలు కలిగి ఉండటాన్ని సహించేది లేదని డిఎంకె స్పష్టం చేసింది. అళగిరితో సంబంధాలను కొనసాగించే పార్టీ నేతలు, నాయకుల పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
రెండు రోజుల క్రితం అళగిరి తన వర్గం వారితో మధురైలో భేటీ అయ్యారు. భవిష్యత్తు ప్రణాళికల పైన చర్చించారు. ఈ నేపథ్యంలో డిఎంకె హెచ్చరికలు జారీ చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘించే వారిని పార్టీ ఉపేక్షించదని తెలిపింది. మరోవైపు, తాను డిఎంకెకు వ్యతిరేకం కాదని అళగిరి ప్రకటించారు. డిఎంకె సరైన అభ్యర్థులను బరిలోకి దించడం లేదని, ఓడిపోవడం ఖాయమన్నారు.

కాగా, తండ్రి ఆగ్రహంతో డిఎంకె నుంచి బహిష్కృతుడైన కరుణానిధి కుమారుడు ఎంకె అళగిరి(63) తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఐదు రోజుల క్రితం చెన్నైలో భేటీ అయిన విషయం తెలిసిందే. పొత్తుల విషయంలో కరుణానిధితో విభేదించడం వల్ల అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. మరో రెండు నెలల్లో సొంత పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అళగిరి ఆ తర్వాత ప్రకటించారు.
అళగిరి కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారనే విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ... లోకసభ ఎన్నికల తర్వాత కొత్త పార్టీపై ఆలోచిస్తానని చెన్నైలో చెప్పారు. తన కేడర్‌తో చర్చించాక వచ్చే రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటానని ఆయన ఇటీవల చెప్పారు.












Click it and Unblock the Notifications