గ్రేట్ డాటర్: తండ్రి ప్రాణాలు కాపాడేందుకు ఏం చేసిందో తెలుసా?

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆడపిల్ల పుట్టిందంటే బాధపడిపోయే తండ్రులకు ఈ ఘటన ఓ గుణపాఠంగా నిలుస్తుంది. ఓ యువతి తన తండ్రిని కాపాడుకునేందుకు తన ప్రాణాలను సైతం లెక్కడ చేయలేదు. ఆమె చేసిన సాహసోపేత నిర్ణయాన్ని ఓ వైద్యుడు వెలుగులోకి తెచ్చాడు.

ధైర్యశాలి

ధైర్యశాలి

వివరాల్లోకి వెళితే.. డాక్టర్‌ రచిత్‌ భూషణ్‌ శ్రీవాస్తవ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఇందుకు సంబంధించిన పోస్టును పెట్టాడు. పూజా బిజార్ణియా అనే ఓ ధైర్యం కలిగిన కూతురు చావు బతుకుల మధ్యనున్న తన తండ్రిని రక్షించడం కోసం తన లివర్‌ను దానం చేసిందని పేర్కొన్నారు.

అభినందించకుండా..

అభినందించకుండా..

ఆ ఆపరేషన్‌ సక్సెస్‌ అయిందని, తండ్రికి లివర్‌ను దానం చేసిన ఆ కూతురును అభినందించకుండా ఉండలేకపోతున్నానంటూ డాక్టర్‌ భూషణ్‌ పేర్కొన్నారు.

తండ్రీకూతుళ్ల ఫొటోలు..

తండ్రీకూతుళ్ల ఫొటోలు..

కూతుళ్లు ఎందుకు పనికిరారంటూ వాపోయే తండ్రులకు ఈమె ఓ గుణపాఠమని చెప్పారు. కాగా, ఈ తండ్రి కూతుళ్ల ఫొటోను కూడా ఆయన తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు.

నెటిజన్ల ప్రశంసలు

డాక్టర్ రచిత్ భూషణ్ శ్రీవాస్తవ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేసిన ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఆ ధైర్యశాలి కూతురుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తండ్రి ప్రాణాలు కాపాడేందుకు ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నావంటూ కొనియాడారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If you thought you have had enough of the Internet and the insensitive trolls that make the space toxic, then this story is sure to warm the cockles of your hearts.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి