పనిచేసేది ఇషా ఫౌండేషన్‌లో..చేసేవి పాడుపనులు: డాక్టర్ అరెస్టు

కోయంబత్తూరు: తమిళనాడులోని తొండముత్తురు ప్రాంతంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్‌లో ఓ డాక్టర్ 12 మంది విద్యార్థిణిలను లైంగికంగా వేధించాడు. ఈయన్ను పెరూరు మహిళా పోలీసులు కోయంబత్తూరులో అరెస్టు చేశారు.ఈ డాక్టరు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగ్గీ వసుదేవ్ అలియాస్ సద్దురుకు చెందిన ఇషా ఫౌండేషన్‌లో పనిచేస్తున్నాడు.

అరెస్టు అయిన డాక్టరును 33 ఏళ్ల శరవణమూర్తిగా గుర్తించారు.ఈయన తిరుపత్తూరు జిల్లాకు చెందిన వాడు.ఇషా ఫౌండేషన్ నిర్వహిస్తూన్న యాక్షన్ ఫర్ రూరల్ రెజువెనేషన్ పేరుతో ఉచిత మెడికల్ క్యాంపు సందర్భంగా డాక్టర్ శరవణమూర్తి 6వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య ఉన్న బాలికలను లైంగికంగా వేధించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సెప్టెంబర్ 4వ తేదీన విద్యార్థులకు విద్యాధికారులకు మధ్య జరిగిన సమావేశంలో బయటపడింది. డాక్టరు వారిని ఎక్కడంటే అక్కడ తాకుతూ తప్పుగా ప్రవర్తించాడని విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

Doctor who works with Isha foundation arrested for sexually assaulting students

ఇక ఈ ఘటన గురించి పాఠశాల యాజమాన్యం వెంటనే బాలల సంక్షేమ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ పోలీసులకు అప్పజెప్పింది. పోలీసులు స్కూలుకు వెళ్లి ప్రతి విద్యార్థి దగ్గర నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.విచారణ అనంతరం డాక్టరును పోలీసులు అరెస్టు చేశారు.డాక్టర్ శరవణమూర్తి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోక్సో కోర్టు ముందు నిందితుడిని హాజరుపర్చగా జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

ఎడ్యుకేషనల్ ఇన్స్‌టిట్యూషన్స్‌లో విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తోంది తమిళనాడు ప్రభుత్వం.ఈ క్రమంలోనే వల్‌పరాయ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో విద్యార్థులను లైంగికంగా వేధించిన నలుగురు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.దీంతో స్కూళ్లు కాలేజీల్లో విద్యాధికారులు విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు కొత్తగా అప్పాయింట్ అయిన తమిళనాడు చీఫ్ సెక్రటరీ ఎన్.మురుగానందం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+