అయ్యో పాపం: ముక్కులోకి దూరి.. మెదడు భాగంలొ తిష్టవేసిన బొద్దింక

అనుకోకుండా ఓ మహిళ ముక్కులోకి దూరిన బొద్దింక సరాసరి వెళ్లి మెదడు భాగంలో తిష్ట వేయగా, వైద్యులు శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన అరుదైన ఘటన ఇది.

చెన్నై: అనుకోకుండా ఓ మహిళ ముక్కులోకి దూరిన బొద్దింక సరాసరి వెళ్లి మెదడు భాగంలో తిష్ట వేయగా, వైద్యులు శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన అరుదైన ఘటన ఇది. వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నైలోని ఈంజంబాక్కంలో గౌరియమ్మన్ ఆలయ వీధికి చెందిన మునుస్వామి భార్య సెల్వి(42). జనవరి 31వ తేదీ రాత్రి నిద్రపోతుండగా ఆమె ముక్కలోకి ఓ బొద్దింక దూరింది. దీంతో సెల్వి తీవ్రంగా ఇబ్బంది పడింది.

బుధవారం సమీపంలోని ఆసుపత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు ముక్కలో కండలు పెరిగి ఉంటాయని చెప్పి కొన్ని మందులు ఇచ్చి పంపించేశారు. ఇంటికొచ్చి వైద్యులు రాసిచ్చిన మందులు వాడినా బాధ తగ్గలేదు.

Doctors remove large live cockroach from woman's head in Chennai

దీంతో సెల్వి మరో అసుపత్రికి వెళ్లింది. అక్కడ స్కానింగ్ చేసి ఆమె మెదడు భాగంలో బొద్దింక ఉన్నట్లు చెప్పారు. అయితే దానిని బయటికి తీసే సాంకేతిక పరిజ్ఞానం తమ ఆసుపత్రిలో లేదని తెలుపడంతో సెల్వి స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించింది.

అక్కడి చెవి, ముక్కు, గొంతు వ్యాధి నిపుణులు శంకర్, ముత్తుచిత్ర తదితరులు ఆమెను పరీక్షించి బొద్దింక ఇంకా ప్రాణంతో ఉన్నట్లు గుర్తించారు. చివరికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరం ద్వారా గురువారం ఆ మెదడు భాగంలోని బొద్దింకను బయటికి తీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+