• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గ్రేట్ వార్ : పిల్లలను కాపాడేందుకు పాముతో యుద్ధం చేసిన కుక్క

|
  పాముతో కుక్క పోరాటం

  ఒడిషా: పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వారిని కాపాడుకోవడం తల్లిదండ్రు బాధ్యత. మనుషులైనా సరే.. జంతువులైనా సరే. ఉదాహరణకు కుక్క తన కుక్కపిల్లల జోలికి వస్తే సింహంలా మారి దాడి చేస్తుంది. కోడి కూడా కోడిపిల్లల పైకి వస్తే ఎగిరి తన ముక్కుతో పొడుస్తుంది. పిల్లి కూడా అదే పద్ధతిలో దాడి చేస్తుంది. ఇది సృష్టి ధర్మం. ఎవరైనా తన పిల్లల జోలికి వస్తే ఏ జంతువు ఊరుకోదు. పిల్లలను ఏమైనా చేస్తామని భయంతో వాటిని కాపాడుకునే క్రమంలో దాడి చేస్తాయి. అంతేకాదు పెంపుడు జంతువులు కూడా సొంత యజమాని పిల్లలను తాకేందుకు వస్తే వారిపై దాడికి తెగబడతాయి.

  ఆకలితో ఉన్న పాము తచ్చాడుతూ ఇంట్లోకి ప్రవేశం

  ఆకలితో ఉన్న పాము తచ్చాడుతూ ఇంట్లోకి ప్రవేశం

  తాజాగా ఒడిషాలో ఓ ఘటన చోటుచేసుకుంది. ఆకలితో ఓ పాము తచ్చాడుతూ అటూ ఇటూ తిరగుతూ తెల్లవారుజామున ఓ ఇంటిలోకి ప్రవేశించింది. అక్కడే ఓ కుక్క తన పిల్లలతో ఉంటోంది. పాము నేరుగా పిల్లల దగ్గరకు వెళ్లి పడగ విప్పి అటూ ఇటూ చూస్తోంది. పాము బుస శబ్దానికి కుక్క కళ్లు తెరిచి చూడగానే షాక్‌కు గురైంది. తన పిల్లలపైకి శతృవు దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని భావించిన కుక్క ఏ మాత్రం ఆలస్య చేయకుండా పిల్లలను కాపాడే పనిలో నిమగ్నమైంది.

  పాము కాటుకు రెండు పప్పీలు మృతి

  పాము కాటుకు రెండు పప్పీలు మృతి

  కుక్కకు ఏడుగురు పిల్లలు. ఓ వైపు పప్పీలపై పాము బుసకొడుతూ మీదకు వస్తోంది. చిన్న కుక్కపిల్లలు అరుస్తున్నాయి. మరోవైపు వాటిని కాపాడే ప్రయత్నంలో తల్లి కుక్క తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ విషసర్పాన్ని ఎదుర్కునేందుకు తల్లి కుక్క గట్టిగా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే గట్టిగా మొరుగుతోంది. ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురుచూడ సాగింది. అయినప్పటికీ పాముపైకి ప్రాణాలు తెగించి దాడి చేసింది. ముందు తల్లి కుక్కను పక్కకు తొలగిస్తే ఆ తర్వాత పప్పీల పని పట్టొచ్చనుకుందో ఏమో ఈ నాగుపాము... తల్లి కుక్కపై దాడి చేసేందుకు ముందుకు వెళ్లింది. అప్పటికే రెండు చిన్న పప్పీలపై కాటు వేయడంతో ఆ కుక్క పిల్లలు చనిపోయాయి.

  పామును నిలువరించిన మహ్మద్ రఫి

  పామును నిలువరించిన మహ్మద్ రఫి

  తెల్లవారుజాము కావడం ఓ వైపు పాము బుసలు మరోవైపు కుక్క మొరుగుతుండటంతో ఇంట్లో వారు నిద్రలేచారు. ఏమి జరుగుతోందో తెలుసుకునేందుకు కుక్క ఉన్న చోటికి వెళ్లారు. ఇంకే అక్కడ బారును ఉన్న పామును చూసి కాస్త భయపడ్డారు. వెంటనే స్థానికంగా ఉండే మహ్మద్ రఫి అని పాములు పట్టేవారిని పిలిపించారు. ఆయన వచ్చి పామును పట్టుకున్నాడు . అయినప్పటికీ ఆ పాము పగ చల్లారలేదు. ఎలాగైనా సరే కుక్కను చంపాలనే ప్రయత్నం తీవ్రంగా చేసింది. మహ్మద్ రఫి నుంచి ఆ పాము తప్పించుకునే ప్రయత్నం చేసింది. రఫి మాత్రం చాకచక్యంగా వ్యవహరించి మళ్లీ పట్టుకుని దాన్ని ఓ బాటిల్‌‌లో బంధించాడు. మొత్తానికి ఏడు కుక్కపిల్లల్లో రెండు మృతి చెందగా మరో ఐదు కుక్కపిల్లలు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాయి. కుక్క పాము మధ్య జరిగిన యుద్ధాన్ని ఇంట్లో వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  This dog's motherly instincts led her to bravely fight a poisonous snake that was threatening her family of puppies.Filmed near the outskirts of Bhadrak, Odisha in eastern India on September 17, the video shows the mother dog barking ferociously at the cobra.The dog and its seven puppies had taken shelter under the staircase of a house. When the snake slithered in and bit two of the puppies, leaving them dead, the mother dog pounced upon the poisonous snake.On hearing the fierce hissing and barking, local people gathered at the spot to watch the fight.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more