డోక్లామ్ ఎఫెక్ట్: బీపీఎం సమావేశానికి ఇండియాకు అందని ఆహ్వనం
న్యూఢిల్లీ: డోక్లామ్ వివాదం నేపథ్యంలో చైనా దేశ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఇండియా సైన్యాన్ని ఆహ్వనించలేదు. 2005 తర్వాత బీపీఎం సమావేశం జరగకపోవడం బహుశా ఇదే ప్రథమం.
ఇండియా, చైనా దేశాల మధ్య డోక్లాం వద్ద ఇటీవల కాలంలో తీవ్రమైన సమస్య ఏర్పడింది. అయితే ఈ సమస్యను రెండు దేశాలు చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొన్నారు.
డోక్లాం వివాదాన్ని మర్చిపోదామని చైనా చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అది వాస్తవరూపం దాల్చడం లేదు. సాధారణంగా దేశ ఆవిర్భావ వేడుకుల సమయంలో సరిహద్దు సైనికులతో సంప్రదాయ సమావేశాన్ని ఇరుదేశాలు కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాయి.
అయితే తొలిసారిగా డోక్లాం వివాదం తరువాత చైనా.. తమ దేశ ఆవిర్బావ వేడుకలకు భారత సైన్యాన్ని ఆహ్వానించలేదు. చైనా-భారత్ మధ్య మొత్తం 4,057 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దులో మొత్తం అయిదు ప్రాంతాల్లో చైనా ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రతి ఏడాది బోర్డర్ పర్సనల్ మీటింగ్ (బీపీఎం) జరుగుతుంది.

భారత్ సైతం ఆగస్టు 15 వేడుకలకు సరిహద్దుల్లో ఉన్న చైనా సైన్యాన్ని ఆహ్వానిస్తోంది. డోక్లాం ఎఫెక్ట్ తరువాత ఈ ఏడాది తొలిసారిగా చైనా బీపీఎంకు భారత సైన్యాన్ని చైనా ఆహ్వానించలేదు.
భారతదేశ స్వతంత్ర వేడుకలకు సైతం బీపీఎం మీటింగ్‌కు చైనా సైన్యాన్ని ఆహ్వానించింది. ఇరు దేశాల సైనికులు ఆవిర్భావ, స్వతంత్ర వేడుకల సమయంలో కలిసి సైనిక కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇరుదేశాల మధ్య 2005 తరువాత బీపీఎం మీటింగ్ జరగక పోవడం ఇదే తొలిసారి.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications