మాట మార్చిన చైనా, సైన్యం పహరా కొనసాగిస్తోంది: డ్రాగన్
న్యూఢిల్లీ:డోక్లామ్ వివాదానికి పరిష్కారం లభిస్తోందని భావిస్తున్న తరుణంలో చైనా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వివాదాస్పద స్థలం నుండి రెండు దేశాలు సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రతిపాదనకు రెండు దేశాలు అంగీకరించినట్టు వార్తలు వెలువడిన గంటలోనే చైనా మరోసారి తన వక్రబుద్దిని వెల్లడించింది.
ఇండియా, చైనా మధ్య డోక్లామ్ వద్ద సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఈ తరుణంలోనే రెండు దేశాల మధ్య వివాదానికి పరిష్కారం లభిస్తోందని ఇటీవలే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు.
డోక్లాం వివాదం ముగిసిందనుకుంటున్న నేపథ్యంలో చైనా తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. డోక్లాం సమస్యకు పరిష్కారం కుదిరిందని, దౌత్య మార్గాల ద్వారా సరిహద్దు నుంచి సైన్యాన్ని ఇరు దేశాలు సైన్యాన్ని వెనక్కి పిలిపించుకునేందుకు అంగీకారం కుదిరిందని భారత విదేశాంగశాఖ ప్రకటించిన కాసేపటికే చైనా మరో ప్రకటన విడుదల చేసింది.
డోక్లాం నుంచి ఇండియా మాత్రమే సైన్యాన్ని ఉపసంహరించుకుందని, తమ సైన్యం మాత్రం అక్కడే ఉంటుందని పేర్కొంది. ఆ ప్రాంతంలో తమ సార్వభౌమాధికారం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో డోక్లాం వివాదానికి తెరపడిందని, దౌత్యపరంగా సమస్య పరిష్కారమైందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇక ఈ వివాదం ముగిసిన ముచ్చటేనని పేర్కొంది. అయితే ఆ వెంటనే చైనా స్పందిస్తూ చైనా దళాలు సరిహద్దు వద్ద గస్తీ కాస్తాయని చైనా ప్రకటించింది.

తన ప్రాంతీయ సమగ్రతను కాపాడుకుంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్యింగ్ తెలిపారు. ఈ నెల 28న భారత్ డోక్లాం నుంచి తన బలగాలను ఉపసంహరించుకుందని ప్రకటించారు.
చైనా బలగాలు మాత్రం తమ దేశ సార్వభౌమాధికారం, చట్టబద్ధమైన హక్కులను కాపాడుకునేందుకు చర్యలు చేపడతాయంటూనే భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలకే తాము ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు.
-
ఏడాదికే గ్రాట్యుటీ.. ఐదేళ్ల నిరీక్షణకు చెక్ -
కొత్త ఫోన్ లాంఛ్ చేసిన "Honor".. కిర్రాక్ ఫీచర్స్ ! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications