చైనాపై పంతం నెగ్గించుకున్న భారత్: డొక్లాంలో ఇరుదేశాల సైన్యాలు వెనక్కి
రెండు నెలలకు పైగా భారత్, భూటాన్, చైనా సరిహద్దులోని డోక్లామ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
న్యూఢిల్లీ/బీజింగ్: రెండు నెలలకు పైగా భారత్, భూటాన్, చైనా సరిహద్దులోని డోక్లామ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఇరు దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించేందుకు సిద్దపడ్డాయి.
చాలా రోజుల తర్వాత ఉద్రిక్త పరిస్థితి ఎట్టకేలకు సమసిపోయింది. ఇక్కడ మోహరించిన భారత్, చైనాల సైన్యం ఒకేసారి వెనక్కు మళ్లేలా ద్వైపాక్షిక చర్చల్లో ఒప్పందం కుదిరింది.

ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకున్నామని పేర్కొంది. ఇక సాధ్యమైనంత త్వరగా సరిహద్దుల్లోని సైన్యాన్ని రెండు దేశాలూ వెనక్కు పిలుచుకోనున్నాయని తెలిపింది.
కాగా, చైనా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమవుతున్న సమయంలో ఈ వివాదం సమసిపోవడం గమనార్హం. బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు మోడీ చైనాకు వెళ్లనున్నారు.
కాగా, ఇప్పటికే చైనా, భారత్‌లు తమ సైన్యాలను వెనక్కు తీసుకుంటున్నాయని తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక నేడే మొత్తం సైన్యం వెనక్కు వస్తుందా? లేక దశలవారీగా వస్తుందా? అన్న విషయమై విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వలేదు. రెండు దేశాలూ ఒకేసారి సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని ఆదినుంచి డిమాండ్ చేస్తున్న భారత్, తన పంతాన్ని నెగ్గించుకోవడం విశేషం.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications