చైనా సరిహద్దు వెంట సైన్యాన్ని మోహరించిన ఇండియా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకుగాను భారత్ సన్నద్దమౌతోంది. డోక్లామ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో మరింత సైన్యాన్ని మోహరించింది భారత్.

డోక్లామ్ వద్ద భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం సాగుతోంది.ఈ తరుణంలోనే చైనా కూడ అమీతుమీకి సిద్దమంటూ ప్రకటనలు చేస్తోంది. భారత్ కూడ తాము తక్కువేమీ కాదని ప్రకటించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దమేనని ఇండియా కూడ ప్రకటించింది.

Doklam standoff: India deploys more troops along China border in Sikkim, Arunachal, says report

ఈ తరుణంలోనే చైనా సరిహద్దు వెంట అరుణాచల్‌ప్రదేశ్, డోక్లామ్, సిక్కిం వద్ద సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించింది భారత్. సుమారు 1400 కిలోమీటర్ల చైనా ఇండియా సరిహద్దు వెంట సిక్కిం నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు సైన్యాన్ని పెద్దఎత్తున ఇండియా మోహరించింది.

సైనో -ఇండియా సరిహద్దును రక్షించేందుకు సుకునాకు చెందిన 33 , అరుణాచల్,అస్సాంలలోని 3, 4 దళాలు పనిచేయనున్నాయి.

అయితే చైనా మాత్రం డొక్లామ్ వద్ద ఉన్న తన సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. సైన్యాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడ గతంలోనే చైనా హెచ్చరించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With China intensifying its bellicose tone amid the ongoing Doklam standoff, India has deployed more troops along the entire stretch of its border with China in Sikkim and Arunachal Pradesh sectors, senior government officials said.
Please Wait while comments are loading...