employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..!

ఉద్యోగుల (employees)కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇన్నాళ్లూ డీఏ (DA) పెంపు కోసం వారు ఎన్ని పోరాటాలు చేసినా, కోర్టులకు వెళ్లినా డీఏ పెంపుకు అంగీకరించకుండా పట్టుదల ప్రదర్శించిన ఆమె.. ఇవాళ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న వేళ భారీ ప్రకటన చేశారు. ఉద్యోగులకు ఉన్న డీఏ బకాయిలన్నీ చెల్లించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

ఇవాళ పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేయబోతోంది. అంతకు ముందే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చి నుండి రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్ (DA) బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించడం ప్రారంభిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది , గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థల కార్మికులను కవర్ చేస్తుందని వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు.

Lakhs of State Employees Teachers and Pensioners Receive DA Arrears Payout

మా మా-మట్టి-మనుష్ ప్రభుత్వం దాని ఉద్యోగులు, పెన్షనర్లందరికీ, మా విద్యా సంస్థల లక్షలాది మంది ఉపాధ్యాయులు , బోధనేతర సిబ్బందికి, అలాగే పంచాయతీలు, మునిసిపల్ సంస్థలు, ఇతర స్థానిక సంస్థలు వంటి మా ఇతర గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థల ఉద్యోగులు/పెన్షనర్లకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిందని ప్రకటించడానికి సంతోషిస్తున్నట్లు మమత ట్వీట్ చేశారు. తమ ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లలో వివరించిన విధానాల ప్రకారం వారు మార్చి 2026 నుండి వారి 2009 DA బకాయిలను పొందడం ప్రారంభిస్తారని దీదీ వెల్లడిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+