వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమల పంపండి: కేసీఆర్‌కి వీహెచ్‌పీ హెచ్చరిక, టీపై దృష్టి(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో నిజాం కాలంనాటి పాలనను మళ్లీ తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదే జరిగితే ప్రతి యువకుడూ సర్దార్ వల్లభాయ్ పటేల్‌ అవుతాడని విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా హెచ్చరించారు.

వీహెచ్‌పీ ఏర్పడి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన భాగ్యనగర్‌ హిందూ శక్తి సంగమం స్వర్ణ జయంతి సభలో తొగాడియా ప్రసంగించారు.

ఇప్పుడు జరుగుతున్న ఉత్సవం హిందూ ప్రజానీకంలో సంకల్పం తేవడానికి నిర్వహిస్తున్నదని, అయోధ్యలో రామమందిరం నిర్మించినప్పుడు, రావల్పిండి, లాహోర్‌లతో కూడిన అఖండ భారత్‌ను తిరిగి సాధించుకున్నప్పుడే నిజమైన ఉత్సవమని చెప్పారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

తెలంగాణలో నిజాం కాలంనాటి పాలనను మళ్లీ తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదే జరిగితే ప్రతి యువకుడూ సర్దార్ వల్లభాయ్ పటేల్‌ అవుతాడని విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా హెచ్చరించారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

వీహెచ్‌పీ ఏర్పడి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన భాగ్యనగర్‌ హిందూ శక్తి సంగమం స్వర్ణ జయంతి సభలో తొగాడియా ప్రసంగించారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

ఇప్పుడు జరుగుతున్న ఉత్సవం హిందూ ప్రజానీకంలో సంకల్పం తేవడానికి నిర్వహిస్తున్నదని, అయోధ్యలో రామమందిరం నిర్మించినప్పుడు, రావల్పిండి, లాహోర్‌లతో కూడిన అఖండ భారత్‌ను తిరిగి సాధించుకున్నప్పుడే నిజమైన ఉత్సవమని చెప్పారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

ఉర్దూ అకాడమీకి రూ.30 కోట్లు కేటాయించిన ప్రభుత్వం తెలుగుకు కేవలం రూ.30 లక్షలు మాత్రమే కేటాయించిందంటూ ధ్వజమెత్తారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

జెరూసలెం పంపుతామంటున్నారని, హిందువులకు మందిరం అవసరం లేదా అని ప్రశ్నించారు. అఫ్జల్‌కు ఉద్యోగం చేసే అర్హత ఉంటుంది కానీ హిందువుల పిల్లలకు లేదా అని నిలదీశారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

హిందువుల్లోని పేదలు వైద్యం కోసం 18602333666 నెంబర్‌కు ఫోన్ చేస్తే ప్రైవేటు వైద్యం అందుతుందని సూచన చేశారు. దేశంలో కామన్‌ సివిల్‌ కోడ్‌ అమల్లోకి రావాలన్నారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

బంగ్లాదేశ్‌లో హిందువులు 30 శాతం నుంచి 8 శాతానికి, పాకిస్థాన్‌లో ఒక శాతానికి పడిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.

 విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

మూడు కోట్ల మంది బంగ్లాదేశీయులను తిరిగి పంపించి వేయాలని డిమాండ్‌ చేశారు. ముస్లీం రిజర్వేషన్లు అమలు కానివ్వబోమన్నారు.

 విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

నాడు దారి తప్పి మతం మారిన వారు తిరిగి హిందూమతంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇక ఏ ఒక్క హిందువును మతం మారనివ్వబోమన్నారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్


అందరం గోవధ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వాలు దళితులను తిరుమలకు పంపాలని డిమాండ్ చేశారు. హిందువుల గురించి ఆలోచించే శాసన వ్యవస్థ రావాలన్నారు.

 విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

మతం మారిన వారిని హిందువులుగా మారుస్తామని చెప్పారు. హిందూమతంతో పాటు ధర్మాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్క హిందువూ సంకల్పం తీసుకోవాలని చెప్పారు.

 విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

బ్రిటిష్ కాలంలో మన సంపదతో పాటు సంప్రదాయాలను ఛిన్నాభిన్నం చేశారని విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా అన్నారు.

 విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

ఆరెస్సెస్ కార్యవాహ సురేష్ జోషి మాట్లాడుతూ భారత కుటుంబ వ్యవస్థను పాశ్చాత్య సంస్కృతి చిన్నాభిన్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

హిందూ చైతన్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందని, దేశవ్యాప్తంగా అనేకచోట్ల నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాల్లో ఇది ప్రస్ఫుటమవుతోందని అన్నారు.

 విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

జాగరూకత, సంస్కృతిని అర్ధం చేసుకోవడం, నిర్వాహక బాధ్యత తీసుకోవడం, హిందువుగా భాగస్వామ్యం కావడం ముఖ్యమని అన్నారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

అంతర్జాతీయంగా వస్తున్న సవాళ్లను, లోపాలను సరిదిద్దడంలో హిందువులు తమ శక్తిని గుర్తించాలని, పరిష్కారాలను సూచించాలని చెప్పారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

భ్రూణ హత్యలను ఎదుర్కోవాలని, కుటుంబ విలువలను కాపాడాలని, సమాజంలో శాంతి సామరస్యాలను నిలపాలని అన్నారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

హిందువుల సెంటిమెంట్‌ను కాపాడాలని తాము అన్ని మతాల వారికీ సూచిస్తున్నామని, ఒకరిపై ఒకరికి విశ్వాసం పెంచుకునేలా మిగిలిన వారు సైతం హిందూ సెంటిమెంట్లను గౌరవించాలని అన్నారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

దేశంలో టెర్రరిజం, చొరబాట్లు, వామపక్ష తీవ్రవాదం, విచ్చిన్నకర ఉద్యమాలు ఎక్కువయ్యాయని దీనివల్ల దేశంలో శాంతి నశిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ప్రతినిధి కమలానంద భారతి మాట్లాడుతూ యుగాలు మారినా మతాలు మారనివారు హిందువులని వ్యాఖ్యానించారు.

 విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

జాతీయ ఎస్సీ రిజర్వేషన్‌ రక్షణ కమిటీ నేత కర్నె శ్రీశైలం మాట్లాడుతూ దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లను అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనను తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

 విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు రాఘవ రెడ్డి, చినజీయర్‌స్వామి, నాగఫణిశర్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి కూడాపాల్గొన్నారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

స్వర్ణ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్న ‘విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ)' తెలంగాణపైనా దృష్టి సారించింది. ఇక్కడి హిందూ వర్గాల్లో ధార్మిక, సనాతన భావాజాలాన్ని మరింత పెంపొందించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే వీహెచ్‌పీ తెలంగాణ శాఖను ఏర్పాటు చేయబోతుంది.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

ఈ మేరకు నగరంలోని రాయదర్గాలో గల నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడు రోజుల పాటు జరుగుతున్న ప్రపంచ హిందూ సదస్సులో తెలంగాణ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

తెలంగాణలోని 10 జిల్లాల్లో వీహెచ్‌పీ కార్యకలాపాలను విస్తరించాలన్నదే ఈ శాఖ ప్రధాన లక్ష్యం. శనివారం ప్రారంభమైన ప్రపంచ హిందూ సదస్సులో వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖ్‌లు పాల్గొన్నారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి, కార్యాధ్యక్షుడు ప్రవీణ్‌ భాయ్‌ తొగాడియా, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి, దేశ, విదేశాల నుంచి 180 మంది వరకు ప్రతినిధులు ఈ ప్రపంచ సదస్సులో పాల్గొన్నారు.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పూర్వాంధ్ర విభాగంలో కోస్తాంధ్ర, చిత్తూరు జిల్లాలు, పశ్చిమాంధ్ర విభాగంలో తెలంగాణలోని 10 జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, అనంతపూర్‌, కడప జిల్లాలు ఉండేవి.

విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని సదస్సులో నిర్ణయించారు. వీహెచ్‌పీ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్‌ 17 నుంచి దేశ వ్యాప్తంగా స్వర్ణ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

English summary
The National Vishwa Hindu Parishad leaders called for increasing and strengthening Hindu population in the country through strategic efforts and called for ‘ghar wapsi’ in Andhra Pradesh and Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X