హోళీ వేళ మహిళలకు రంగు పూస్తే.. మీ జీవితానికి శుభం కార్డే..! త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!!

హైద‌రాబాద్ : హోళీ సంద‌ర్బంగా దారెంట వెళ్తున్న అమ్మాయిల‌కు స‌ర‌దాగా రంగులు పుల‌దామ‌నుకుంటున్నారా..? జాగ్ర‌త్త..! రంగు ప‌డుద్ది.. ప‌రిచ‌యం లేని వ్య‌క్తి నా మోఖానికి రంగు పూసి ఏడిపించాడ‌ని అమ్మాయిలు పోలీసు స్టేష‌న్లో ఫిర్య‌దు చేస్తే చాలు మీ జీవితం రంగుల‌మ‌యం అవ్వ‌డం దేవుడెరుగు.. చీక‌టి మ‌యం అవ్వ‌డం ఖాయం. హోలీ వేడుకల్లో యువత ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొంటుంది.

ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని ఆనందిస్తుంటారు. అయితే ఇటువంటప్పుడు మహిళలపై ఎవరైనా యువకులు బలవంతంగా రంగులను జల్లితే దానిని చట్టం నేరంగా పరిగణిస్తుంటుంది. భారతీయ శిక్షాస్మృతి మహిళలకు విశేష రక్షణను కల్పించింది. అందుకే పోలీసులు. మహిళలపై ఇటువంటి సంఘటనలు జరిగినపుడు వెంటనే స్పందించి, నిందితులపై సెక్షన్ 354 కింద చర్యలు చేపడతారు.

Dont color the ladies on the Holi day..! its a crime..! be careful..!!

నేరం రుజువైతే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులపై ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. మహిళలను బెదిరించి, లైంగికంగా ఒత్తిడి చేస్తే 354(ఏ) కింద మూడు సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా ఉంటుంది. బలవంతంగా మహిళల హక్కులను హరిస్తే 354 (బీ) కింద మూడు నుంచి ఏడు సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా కూడా అమలు చేస్తారు. ఒంటరిగా ఉన్న మహిళలను బెదిరించడం, ఫొటోలు తీయడం లాంటి పనులు చేస్తే 354 (సీ) కింద ఒకటి నుంచి మూడు సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. హోళీ పండ‌గ‌ను పెద్ద ఎత్తున కేరింత‌ల‌మ‌ద్య జ‌రుపుకుంటే స‌రి. అలా కాకుండా హ‌ద్దులు మీరితే మాత్రం జీవితం నాశ‌న‌మే..!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+