బాలాకోట్ దాడులా తెలీదే ? ఇండియా పాకిస్థాన్ సంబంధాలు కూడా : సన్నీ డియోల్
న్యూఢిల్లీ : ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత సన్నీడియోల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు బాలాకోట్ వైమానిక దాడుల గురించి తెలియదని కామెంట్ చేశాడు. అంతేకాదు తనకు ఇండియా- పాకిస్థాన్ సంబంధాల గురించి కూడా తెలియదని స్పష్టంచేశారు. ఫిబ్రవరి 27న భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై దాడిచేసిన సంగతి తెలిసిందే.

సేవే మార్గం ..
తన నియోజకవర్గం గురు దాస్ పూర్ లో మంగళవారం సన్నీడియోలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు బాలాకోట్ దాడుల గురించి ప్రశ్నిస్తే .. ఆయన పైవిధంగా స్పందించారు. తనకు దాడుల గురించి తెలియదని .. కేవలం ఎన్నికల్లో గెలిచి దేశానకి సేవ చేయాలనుకుంటున్నానని స్పష్టంచేశారు.

గెలిస్తే .. తెలుస్తుందెమో ..
ఒకవేళ తాను గురుదాస్ పూర్ నుంచి గెలిస్తే .. బాలాకోట్ దాడులు, భారత్, పాకిస్థాన్ సంబంధాల గురించి తెలుస్తుందోమోనని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో మోదీ మంచి పనులు చేశారని కొనియాడారు.

అభివృద్ధి చేస్తా ..
కానీ తాను మాత్రం దేశానికి సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టంచేశారు. ఒకవేళ తాను ఎన్నికల్లో గెలిస్తే మంచి పనులు చేసేందుకు పాటుపడతానని హామీనిచ్చారు గురుదాస్ పూర్ నుంచి సన్నీడియాల్ పై కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. శిరోమణి అకాళీదల్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ మూడుచోట్ల పోటీ చేస్తోంది. మిగతా 10 చోట్ల అకాళీదళ్ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.












Click it and Unblock the Notifications