ఖురాన్ సాకుతో బహుభార్యత్వం తగదు: హైకోర్టు
అహ్మాదాబాద్: పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని ముస్లింలు వాడుకుంటున్న తీరు పట్ల గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బహుభార్యత్వం కోసం ముస్లింలు ఖురాన్‌ను తప్పుగా వాడుకుంటున్నారని కోర్టు అభిప్రాయపడింది.
స్వప్రయోజనాల కోసం ముస్లింలు ఖురాన్‌ను సాకుగా చూపుతున్నారని కోర్టు తన తీర్పులో పేర్కొంది. దేశమంతా ఒకే విధానాన్ని అవలంభించాల్సిన సమయం ఆసన్నమైందని కోర్టు పేర్కొంది.
ఎవరికి వారు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని కోర్టు తన తీర్పులో ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మాదాబాద్‌కు చెందిన జాఫర్ అబ్బాస్ దరఖాస్తున్న చేసుకున్న పిటిషన్‌పై న్యాయవాది జేబీ పర్దివాలా ఈ విధంగా తీర్పును ఇచ్చారు.

మొదటి భార్య అనుమతి లేకుండా జాఫర్ రెండో వివాహం చేసుకున్నాడు. దాంతో మొదటి భార్య జాఫర్‌పై పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దాన్ని సవాల్ చేస్తూ జాఫర్ కోర్టును ఆశ్రయించాడు.
ముస్లిమ్ పర్సనల్ లా ప్రకారం ముస్లింలు నాలుగు సార్లు పెళ్లికి అర్హులని, తనపై నమోదు అయిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టిపారేయాలని జాఫర్ కోర్టును కోరాడు. ఈ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి.. ముస్లింలు బహు భార్యత్వం కోసం ఖురాన్‌ను తప్పుగా వాడుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications